Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

యదేచ్చగా మట్టి అక్రమ రవాణా

రియల్ ముసుగులో రైతుల పొలాలను గుట్టలను కొల్లగొడుతున్న వైనం…

ప్రభుత్వ ఆదాయానికి లక్షల్లో గండి

ఎవరైనా అడిగితే అధికార పార్టీ నాయకులు పేరు చెప్పి నాయకులను బదనాం చేస్తున్న మట్టి మాఫియా

చోద్యం చూస్తున్న సంబంధిత అధికారులు…

అనంతగిరి ఏప్రిల్ 29 (నిజం న్యూస్)

అనంతగిరి మండలంలో మట్టి మాఫియా యదేచ్చగా రెచ్చిపోతుంది. రైతులకు లేనిపోని మాయ మాటలు చెప్పి డబ్బులు ఎర్ర వేసి, కొండలను సైతం పిండి చేస్తూ యదేచ్చగా అక్రమ మట్టి తవ్వకాలు చేస్తున్న సంబంధిత అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు.

అనంతగిరి మండల పరిధిలోని బొజ్జగూడెం తండాలో మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. రాత్రి పగలు అనే తేడా లేకుండా మట్టి దందా కొనసాగిస్తున్న పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. మండల శివారులోని నియోజకవర్గానికి చెందిన మట్టి వ్యాపారులు పొలాలను, గుట్టలను సైతం వదలడం లేదు.

ఆగని మట్టి మాఫియా ఆగడాలు..!

మట్టి మాఫీ ఆగడాలు రోజురోజుకు పెచ్చుమీరీ పోతున్నాయి. రెవిన్యూ మైనింగ్ వైఖరితో మట్టి మాఫియా రెచ్చిపోయి దర్జా గా ట్రాక్టర్లలో మట్టి ( గ్రావెల్) నీ రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అది పట్ట భూమి అయినా లేక ప్రభుత్వ భూమి అయినా మట్టి మాఫియాకు ఒకటే. మట్టి మాఫియా కన్ను పడితే అంతే సంగతులు. తెల్లారేసరికి మట్టి మాయమైపోతుంది.

రాత్రికి రాత్రే సదరు మాఫియా జెసిబిలతో మట్టి (గ్రావెల్) నీ ట్రాక్టర్లో తరలించు పోతారు ఒక ట్రాక్టర్ మట్టి ధర 1700 నుంచి 2000 రూపాయలు మాఫీయా రేటు చెబుతూ విక్రయిస్తున్నారు. దొంగతనంగా దోచుకు తెచ్చిన మట్టిని సదురు మాఫియా విక్రయాలు సాగిస్తున్న పట్టించుకునే అధికారులు లేరని స్థానికులు ఆరోపిస్తున్నారు.

తాజాగా అనంతగిరి మండలం లోని బొజ్జగూడెం తండా గ్రామ శివారులో పట్టా భూమిగా ఉన్న మట్టిగుట్ట పగలు రాత్రి అనే తేడా లేకుండా మట్టి మాఫియా జెసిబి లతో కోదాడ పట్టణంలోని వెంచర్లకు ట్రాక్టర్లతో గ్రావెల్ లను తరలించి దండి గా సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

గ్రామంలో ప్రధాన రహదారిపై పట్టపగలే మట్టి మాఫియా దర్జాగా మట్టిని తరలిస్తూ కాసులు గడిస్తునారు. మట్టి మాఫియా వారు అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్నాయని పలువురికి చెబుతూ అధికార పార్టీ వారిని బదనం చేస్తున్న మట్టి మాఫియా. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటారా వేచి చూడాలి మరి…!