Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కల్మలచెరువు వాసి సైదులు ప్యారా వాలీబాల్ భారత టీం కి ఎంపిక

సైదులుకి కలెక్టర్ చొరవతో సువెన్ కంపెనీ వారి 2. 15 లక్షల ఆర్థిక సహాయం
గరిడేపల్లి,  ఏప్రిల్ 29 (నిజం న్యూస్) గరిడేపల్లి మండలం ,కల్మల్ చేరువు గ్రామ వాసి అయిన అమరారపు సైదులు కజకిస్తాన్ లో జరిగే ప్యారా వాలీబాల్ ఏసియన్ జోన్ ఛాంపియన్ షిప్ కు భారత టీంకు ఎంపికైనారు.

ఈ టోర్నమెంట్ లో పాల్గొనుటకు రూ. 2.15 లక్షలు ఆర్ధిక సహాయం చేయవలసినదిగా శ్రీయుత జిల్లా కలెక్టర్ కి ధరఖాస్తు చేసుకోవడం జరిగింది. అతని దరఖాస్తుని పరిశీలించిన జిల్లా కలెక్టర్ , సువెన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, సూర్యాపేట వారిని అమరారపు సైదులుకు ఆర్ధిక సహాయం చేయవలసినదిగా కోరగా వారు స్పందించి ముందుకు వచ్చి అమరారపు సైదులుకు రూ. 2.15 లక్షలు ఆర్ధిక సహాయం చేయుటకు అంగీకరించినా రు

ALSO READ: శ్రమజీవుల హక్కులకై అసువులు బాసిన అమరవీరుల స్పూర్తికి గుర్తుగా జరుపుకునేదే.. మేడే

సహాయము తేదీ 29 శనివారం రోజున సమీకృత కలెక్టరేట్ కార్యాలయంనందు శ్రీయుత జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా రూ. 2.15 లక్షల చెక్ ను అమరారపు సైదులుకు అందజేయడం జరిగినది.

కార్యక్రమంలో సువెన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, సూర్యాపేట వైస్ ప్రసిడెంట్ కె. వి. శేషగిరి రావు, మేనేజర్ సి. హెచ్. వెంకట్ రెడ్డి మరియు జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి బి. వెంకట్ రెడ్డి పాల్గొన్నారు