Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మత్స్యకారుని కి చిక్కిన 28 కిలోల అరుదైన కచ్చిలి చేప : 1.70 లక్షలకు విక్రయం

చీరాల మండలం వాడరేవు తీరంలో దోనిదేవుడు అనే మత్స్యకారుడు చేపల వేటకు వెళ్లాడు. మంగళవారం అతని వలకు అనూహ్యంగా 28 కిలోల అరుదైన కచ్చిలి చేప చిక్కింది. దీంతో అతని ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఆ చేపను కొనుగోలు చేసేందుకు పలువురు పోటీలు పడ్డారు. చివరకు అదే ప్రాంతానికి చెందిన దారకొండ అనే వ్యాపారి రూ.1.70 లక్షలు పెట్టి ఆ చేపను కొనుగోలు చేశాడు. ఆ డబ్బులను చూసి దోనిదేవుడు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. ఈ చేప పొట్ట భాగాన్ని మెడిసిన్ తయారీలో వినియోగిస్తారని, అందుకే ఇంత ఖరీదు ఉంటుందని మత్స్యకారులు చెప్పారు. కాగా, ఇటీవల రెండున్నర కిలోల పులస చేపను పాశర్లపూడి గ్రామానికి చెందిన వైసీపీ నేత, నగర వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొమ్ముల కొండలరావు ఏకంగా రూ.21 వేలు చెల్లించి సొంతం చేసుకున్నారు.