ఢిల్లీ నుంచి నేరుగా తిరుమలకు బయలుదేరిన సీఎం జగన్

సీఎం జగన్ ఢిల్లీ నుంచి నేరుగా రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమలకు బయలుదేరారు. తిరుమలలో పద్మావతి అతిథి గృహానికి చేరుకుని విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం అతిథి గృహం నుంచి బయలుదేరి అన్నమయ్య భవనం వద్దకు చేరుకుంటారు. 5.30గంటల నుంచి 6 గంటల వరకు అక్కడ నుంచి జరిగే వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొంటారు. 6.10 గంటలకు అక్కడ నుంచి బయలుదేరి బేడి ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుంటారు.

అనంతరం సంప్రదాయ వస్త్రధారణలో శ్రీవారికి సమర్పించే సారెను తీసుకుని 6.40 గంటలకు మహద్వారం గుండా శ్రీవారి ఆలయంలోకి ప్రవేశిస్తారు.6.55 నుంచి 7.05 గంటల మధ్య స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు.అనంతరం వకుళమాతను దర్శించుకుని విమాన ప్రాకారం చుట్టూ ప్రదక్షిణలు చేసి రంగనాయక మండపానికి చేరుకుంటారు. అక్కడ వేద ఆశీర్వచనాలు తీసుకుంటారు. 7.30 గంటల నుంచి 7.35 గంటల వరకు సంపంగి ప్రాకారంలో నిర్వహించనున్న గరుడవాహన సేవలో పాల్గొంటారు.