అక్టోబర్ 2 నుంచి ‘మనం-మన పరిశుభ్రత’ రెండోదశ కార్యక్రమం

అక్టోబర్ 2 నుంచి రాష్ట్రంలో ‘మనం-మన పరిశుభ్రత’ రెండోదశ కార్యక్రమం ప్రారంభించబోతున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం ప్రతి మండలానికి 5 నుంచి 10 గ్రామాలలో అమలవుతందని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రజాప్రతినిధులకు మంత్రి బుధవారం లేఖ రాశారు. జూన్ 1న మొదటిదశ మనం-మన పరిశుభ్రత ప్రోగ్రాం రాష్ట్రంలో ప్రారంభమైందని, జూలై 24 నుంచి 15 రోజుల పాటు పక్షోత్సవాలు జరగనున్నాయి .