యాపిల్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ లాంచ్

యాపిల్ మొబైల్ ఫోన్స్ ను, యాపిల్ ప్రోడక్ట్స్ ను భారత్ లో వినియోగించే వారు చాలా ఎక్కువే..! కానీ భారతదేశంలో యాపిల్ ఆన్ లైన్ స్టోర్ అన్నది రాలేదు. ఇతర ఈకార్ట్ సంస్థలతో కలిసి యాపిల్ సంస్థ తమ ప్రోడక్ట్స్ ను అమ్ముతూ ఉండేది. ఇకపై నేరుగా యాపిల్ సంస్థ తమ సైట్ ద్వారా కూడా అమ్మకాలు జరపనుంది.

ఇకపై యాపిల్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ (www.apple.com/in)ను సందర్శించి కావాల్సినవి కొనుగోలు చేసుకోవచ్చు. థర్డ్ పార్టీ సేవలపై ఆధారపడకుండా నేరుగా యాపిల్ సంస్థకు సంబంధించిన ప్రోడక్ట్స్ ను కొనుక్కోవచ్చు. ఇంకా డైరెక్ట్ కస్టమర్ సపోర్టు కూడా యూజర్లకు భిస్తుంది. కస్టమర్లకు అత్యుత్తమ సేవలను అందించేందుకు నైపుణ్యం కలిగిన తమ ఆన్‌లైన్‌ టీం సిద్ధంగా ఉన్నారని యాపిల్‌ ప్రకటించింది. ఆన్‌లైన్ స్టోర్ ద్వారా యాపిల్ మొదటిసారిగా దేశవ్యాప్తంగా వినియోగదారులకు పూర్తి స్థాయి ఉత్పత్తులు, ప్రీమియం అనుభవాన్ని అందిస్తుంది. రవాణా కోసం ఆపిల్ బ్లూడార్ట్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

యాపిల్ లాంచ్ చేసిన యాపిల్ వాచ్ సిరీస్ 6, కొత్త ఐప్యాడ్ ఎయిర్ తోపాటు, ఐఫోన్, ఐప్యాడ్, మాక్ లాంటి ఉత్పత్తులు ఆన్‌లైన్‌ స్టోర్లలో అందుబాటులో ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా 38 వ ఆన్‌లైన్ స్టోర్ ఆపిల్ ఇండియా స్టోర్ ద్వారా భారతీయ వినియోగదారులకు యాపిల్ నిపుణుల సలహాలు, సూచనలు అందుబాటులో ఉంటాయి.ప్రొడక్ట్ ఫీచర్ల గురించి మరింత తెలుసుకోవడం, సెటప్ చేయడం వరకు వినియోగదారులు ఇంగ్లీష్‌లో ఆన్‌లైన్ లో సాయం అందిస్తుంది. అలాగే ఫోన్ ద్వారా హిందీ ఇంగ్లీషులో నేరుగా సలహాలు ఇవ్వనున్నారు.