‘రంగ్ దే’ సినిమాను ఓటీటీలో విడుదల చేసే అవకాశం

‘రంగ్ దే’ సినిమాను ఓటీటీలో విడుదల చేసే అవకాశం ఉంది అంటూ గత కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వచ్చాయి. జీ5 వారు ఈ సినిమాకు భారీ మొత్తాన్ని ఆఫర్ చేశారు అనేది కూడా మీడియాలో ప్రముఖంగా వార్తలు వచ్చాయి. కాని యూనిట్ సభ్యులు మాత్రం ఓటీటీ విడుదలకు ఆసక్తి చూపడం లేదు అంటూ ఇటీవలే మేము ఒక కథనంను ప్రచురించడం జరిగింది. మేము అన్నట్లుగానే నితిన్ ‘రంగ్ దే’ సినిమాను ఓటీటీలో కాకుండా సంక్రాంతికి థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లుగా దర్శకుడు వెంకీ అట్లూరి అధికారికంగా ప్రకటించాడు. కరోనా కారణంగా ఆరు నెలలుగా షూటింగ్ నిలిచి పోయింది. మళ్లీ ఇన్ని నెలలకు షూటింగ్ ను పునః ప్రారంభించారు. నేటి నుండి అన్ని కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ సినిమాను షూట్ చేస్తున్నట్లుగా దర్శకుడు వెంకీ అట్లూరి ట్విట్టర్ లో పేర్కొన్నాడు. సంక్రాంతికి అందరం కలుద్దాం అంటూ వెంకీ చేసిన ట్వీట్ తో సినిమా సంక్రాంతికి విడుదల కాబోతుంది అంటూ క్లారిటీ వచ్చేసింది. ఈ ఏడాది సంక్రాంతి తర్వాత భీష్మ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్ ఏడాది లోపే ‘రంగ్ దే’ సినిమాను విడుదల చేయబోతున్నాడు. అన్ని సవ్యంగా జరిగి ఉంటే జులై 31వ తారీకున ఈ సినిమాను విడుదల చేసేవారు. కరోనా లాక్ డౌన్ తో మొత్తం ప్లానింగ్ తారు మారు అయ్యింది.