Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలి

బోనకల్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఎమ్మార్పీఎస్ నాయకులు ధర్నా
బోనకల్ ఏప్రిల్ 28 (నిజం న్యూస్) కొదమల శ్రీకాంత్ పై ముక్కుమ్మడిగా దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలి,బోనకల్ సెంటర్లో సినిమా హాలు ఎదురుగా అక్రమంగా నడుస్తున్న బెల్ట్ షాప్ యజమానులు వాళ్ళ అనుచరులు పెద్ద పెద్ద సెంట్రింగ్ కర్రలు తో దాడి చేసి గాయపరిచారు

ఇది 25వ తారీఖున జరిగినప్పటికీ వేలుగులోకి లేటుగా వచ్చిందని అన్నారు. వత్సవాయి మండలం చిట్యాల గ్రామానికి చెందిన ఒక దళిత యువకుడిపై మూక దాడి చేయటానికి తీవ్రంగా ఖండిస్తున్నాం .

ALSO READ: EAMCET కు 3,20,310 మంది విద్యార్థులు దరఖాస్తు

ఖమ్మం జిల్లా బోనకల్ మండలం నడిబొడ్డున పోలీస్ స్టేషన్ కూత వేటు దూరంలో ఈ సంఘటన జరగటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని దళిత యువకుడి పై దాడి చేసిన వారిపై తక్షణమే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి 307అత్యాయత్న కేసు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలని బెల్ట్ షాప్ యాజమాన్యం ఓ దళిత యువకుడ్ని విచక్షణ రహితంగా కొట్టడంతో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్, నాయకులు పోలీస్ స్టేషన్ ముందు ధర్నా. నిర్వహించారు,

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్, మండల గ్రామస్థాయి నాయకులు పాల్గొన్నారు