Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కేంద్ర మంత్రి సభకు కరువైన ప్రజాస్పందన

జుక్కల్ నియోజకవర్గ ప్రతినిధి ఏప్రిల్ 28 నిజం

జహీరాబాద్ ప్రవాస్ యోజన లో భాగంగా జుక్కల్ నియోజకవర్గానికి వచ్చినటువంటి కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మరియు డెయిరి శాఖ మంత్రి పరుషోత్తం రూపాల సభకు ప్రజాస్పందన కరువైంది.

ALSO READ: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం లోని బిచ్కుంద మండల కేంద్రంలోని బండయప్ప ఫంక్షన్ హాల్ లో జరిగిన బిజెపి సభకు నాయకులు కార్యకర్తలకు తప్ప ఊహించినంత మేరకు ప్రజలెవరు రాకపోవడంతో కేవలం 10 నిమిషాలలో అసంతృప్తితో మంత్రి వెనుతిరిగారు.
ఈ సభకు సభా వేదిక వద్ద పెద్ద సంఖ్యలో కుర్చీలు ఖాళీగా కనిపించడంతో ప్రజల నుంచి పేలవ స్పందన కనిపించింది.ముందుగా సభకు భారీ సంఖ్యలో జనాలు వస్తారని ఏర్పాట్లు చేసినా జనాలు ఎక్కువ సంఖ్యలో రాకపోవడంతో అర్ధాంతరంగా సభ ముగిసింది