ఎక్సైజ్ డ్యూటీ,వ్యాట్ తగ్గించాల్సిందే
పెట్రోల్‌పై ఎక్సైజ్ వ్యాట్ ధరలు తగ్గిస్తేనే మేలు
అప్పుడే సామాన్యులకు దక్కనున్న ఊరట
ధరల పెరుగుదలకు కళ్లెం వేయగలుగుతాం
గత ఐదారేళ్లుగా పెట్రో ధరలపై ప్రధాని అవాస్తవాలు చెబుతున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. నిజానికి చమురు కంపెనీలు గనుక ఈ విధంగా ధరలను పెంచిన్టటైతే, అది అక్కడితో ఆగిపోదు. మొత్తం ఆర్థిక వ్యవస్థలో అనేక వస్తువుల ధరలు దాని ఫలితంగా పెరుగుతాయి.
కాంగ్రెస్ హయాంలో పెట్రో ధరలపై విరుచుకు పడ్డ మోడీ ఇప్పుడా విషయం మరచిపోయినట్లు ఉన్నారు. ధరల పెరుగుదాల, జిఎస్టీపైనా గుజరాత్ సిఎంగా విమర్శలు గుప్పించిన విషయం ప్రజలు ఇంకా మరచిపోలేదు.
నిజానికి కేంద్రంపెట్రోల్‌పై ముందుగా ఎక్సైజ్ డ్యూటీ తగ్గించివుంటే బాగుండేది. ఆ తర్వాత వ్యాట్ తగ్గించమని రాష్టాల్రకు చెప్పివుంటే మోడీ నిజాయితీగా ఉన్నాడని అనుకునే వారం. మోడీ అధికారంలోకి వచ్చాక లీటర్ పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని రూ.18 కిపైగా పెంచారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా పదేపదే చెబుతూనే వచ్చారు.
ALSO READ: ప్రజల నుంచి డబ్బులు గుంజడమెలా అన్నదే కేంద్రం ఆలోచన
పీఏ హయాంలో లీటర్ పెట్రోల్‌పై రూ.9.84 ఎక్సైజ్ డ్యూటీ ఉండగా.. మోడీ దాన్ని రూ.27.90కు, లీటర్ డీజిల్‌పై రూ.3.56గా ఉన్న సుంకాన్ని రూ.21.80కు పెంచారు. వ్యాట్ తగ్గించమని రాష్టాల్రను కోరే ముందు ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి చిత్తశుద్ది చాటుకుంటే బాగుండేది.
ఇదిలా ఉంటే సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్ రూపంలో లక్షల కోట్లు ఆదాయం వస్తున్న విషయాన్ని ప్రధాని ప్రజలకు చెప్పడం లేదు. ఎక్సైజ్ సుంకం ద్వారా కేంద్రానికి రూ.26 లక్షల కోట్ల ఆదాయం వచ్చిన విషయాన్ని ప్రధాని ఎక్కడా ప్రస్తావించడంలేదు. జీఎస్టీ వసూళ్లలో రాష్టాల్ర వాటాను సకాలంలో చెల్లించడం లేదు. ఎక్సైజ్ సుంకాన్ని..ఆ తర్వాత రాష్టాల్రు వ్యాట్ తగ్గించాలి. అప్పుడే పెట్రో ధరలు తగ్గి రవాణా ఛార్జీలు తగ్గుతాయి. దీంతో సరకు రావాణా భారం కూడా తగ్గుతుంది.
ప్రతిపక్ష పాలిత రాష్టాల్ల్రో పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయని, అక్కడి ప్రభుత్వాలు విలువ ఆధారిత పన్ను(వ్యాట్) తగ్గించకపోవడమే ఇందుకు కారణమని బిజెపి నేతలు నీతులు వల్లిస్తున్నారు. ఓ రకంగా పెట్రో ధరలపై రాష్టాల్రను అప్రతిష్టపాలు చేయాలన్న ఆలోచన తప్ప నిర్మాణాత్మక ఆలోచన మాత్రం చేయడం లేదు.
ALSO READ: ఉచిత విద్యుత్‌కు ఎసరు..?
సామాన్య ప్రజలకు ఊరట కలిగించడానికి, దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీ,వ్యాట్ తగ్గించాల్సిందే. అప్పుడు ప్రభుత్వం కూడా తన వ్యయాన్ని ఆ మేరకు పెంచవలసి వుంటుంది. ఆ విధంగా అదనపు వ్యయం చేయాలంటే అందుకోసం ప్రభుత్వం తన ఆదాయా న్నీ పెంచుకోవాలి, అందుకు ప్రభుత్వం పెట్రో ఉత్పత్తుల విూద తనకు వచ్చే పన్ను ఆదాయాన్ని పెంచు కోవాలి.
ప్రభుత్వం మాదిరిగానే పెట్రో ఉత్పత్తులను వినియోగించే ప్రతీ సంస్థా ఆర్‌టిసి, ట్రాన్స్‌పోర్ట్ కంపెనీలువంటివి కూడా తమ సేవల రేట్లు పెంచవలసి వుంటుంది. ఇదంతా కలిసి ద్రవ్యోల్బణాన్ని పెంచుతాయి. ఇంతటితోనే ఇది ఆగదని, రాబోయే రోజుల్లో ఇదే విధమైన వడ్డింపులు మరిన్ని రానున్నా యని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు.
అటు కంపెనీలూ చమురు పెరుగుదల భారాన్ని భరించడానికి సిద్ధంగా లేవు. ఇటు ప్రభుత్వమూ పెరిగే ధరల ద్వారా తనకు లభించే అదనపు ఆదాయాన్ని వదులు కోడానికి సిద్ధంగా లేదు. భారమంతా వినియోగదారులపైనే పడేయడం ద్వారాచేతులు దులుపుకోవాలన్న ధోరణిలో పాలకులు ఉన్నారు.