Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఉచిత విద్యుత్‌కు ఎసరు..?

ఉచిత విద్యుత్‌కు ఎసరు
కేంద్రం కుట్రలకు బలి కావద్దు
స్మార్ట్‌ విూటర్ల పై విపక్షాల మండిపాటు
విజయవాడ,ఏప్రిల్‌27: వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో మొదలైన ఉచిత విద్యుత్‌కు మంగళం పాడే కుట్ర జరుగుతోందని కాంగ్రెస్‌ మండిపడిరది. విద్యుత్‌ ఉత్పత్తిని పెంచే ప్రయత్నాలు పెంచాలన్నారు. నిరంతర విద్యుత్‌ ఇచ్చే దిశగా రాష్ట్రం స్వయం సమృద్ధి సాధించాలన్నారు. దీనికి ముందే కేంద్రం కొత్త విద్యుత్‌ సంస్కరణ పేరిట ముసాయిదా పంపించింది.

అందులో విద్యుత్‌ను ఉత్పత్తి వ్యయం కంటే తక్కువకు ఇవ్వరాదని నిర్దేశించింది. అంతేగాక రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర నామమాత్రం చేసి ప్రైవేటు పెత్తనానికి రంగం సిద్ధం చేస్తున్నది. ఈ ప్రకారం చూస్తే ఆరు రూపాయల పైన యూనిట్‌కు విద్యుత్‌ తయారీ ఖర్చు లెక్కకట్టినప్పుడు రాష్ట్రం రెండురూపాయల లోపుగానే సబ్సిడీ ఇవ్వడం అనుమతించ బడుతుందని కాంగ్రెస్‌ నేత తులసిరెడ్డి అభిప్రాయపడ్డారు.

ఇది సహజంగానే ఉచిత విద్యుత్‌పై కేంద్రం పెత్తనానికి నిదర్శనం గా చూడాలన్నారు. ఇకముందు సహజంగానే ఉచితం అని అనడానికి ఆస్కారం ఉండదన్నారు. ద్రవ్యలోటు పరిమితికి మించి అప్పులు తెచ్చుకోవడాన్ని అనుమతించాలంటే కేంద్రం నాలుగు షరతులు పెట్టడంలో ఆంతర్యం ఇదేనని అన్నారు.

ALSO READ: ప్రైవేటు కంపెనీల ప్రయోజనం కోసమే వ్యవసాయ పంపుసెట్లకు విూటర్లు

ఒకే రేషన్‌, పట్టణ పాలక సంస్థ స్వయం సమృద్ధి, స్మార్ట్‌ విూటర్లు, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ పెంచడం అనే ఈ షరతులన్నీ ఆచరణలో ప్రజలపై భారం పెంచడానికి తప్ప మరోటి కాదని సిపిఎం నేత అభిప్రాయపడ్డారు.

ప్రైవేటు కార్పొరేట్ల ప్రయోజనాలకు దారితీసే చర్యలను బిజెపి మరింత వేగం చేసిందన్నారు. స్మార్ట్‌ విూటర్లు ఎందుకంటే ప్రభుత్వం వారికి నగదు బదలాయించి మళ్లీ కట్టించుకోవడం కోసమని చెబుతున్నారు. అయితే ఈ పక్రియ అంత సులభం కాదన్నారు.

నాలుగు పత్రాలు రైతు పేరు, భూయాజమాన్య పత్రం, ఆధార్‌ కార్డు బ్యాంకు ఖాతా అన్నీ సరిపోలితేనే బిల్లు చెల్లించడం జరుగుతుంది. అలాగే అనధికారిక పంపుసెట్లను క్రమబద్దీకరించుకోవడానికి చాలా వ్యయ ప్రయాసలు వడపోతలు ఎదురవుతాయి. ఇదంతా దేనికంటే ఖచ్చితంగా వ్యవసాయానికే ఈ కరెంటు వాడుతున్నట్టు నిర్దారించుకోవాల్సి కూడా ఉంటుంది. అసలు ఉద్దేశమే విద్యుత్‌ వడపోత. అని అన్నారు.

ఈ క్రమంలో తేడాలు ఫిర్యాదు విధానపరమైన మార్పు ఎక్కడికి దారితీస్తాయోనన్న ఆందోళన ఉందన్నారు. గతానుభవాల నేపథ్యంలో చూస్తే హావిూలు ఎన్ని వున్నా సాధించుకున్న రాయితీల కోతపడటం, ప్రయోజనాలు మాయం కావడం తెలుసన్నారు. జగన్‌ అధికారం చేపట్టగానే పిపిఎ సవిూక్ష అంటూ విద్యుత్‌ వ్యయం తగ్గిస్తానన్నారు.

ALSO READ: దేశంలో ఉచిత విద్యుత్‌ సాధ్యమా ?

కేంద్రం ఒత్తిడి తర్వాత ఆ జోరు తగ్గింది. సౌర పవన విద్యుత్‌ను చంద్రబాబు ప్రభుత్వం అవసరాన్ని మించి కొన్నట్టు ఆరోపించారు. ఇప్పుడు తామే దాన్ని విస్తరిస్తామం టున్నారు. ఇప్పటి వరకూ ఉచిత విద్యుత్‌కు నాలుగువేల కోట్లు సబ్సిడీ ఇస్తుంటే ఇప్పుడు దాన్ని ఎనిమిది వేల కోట్లకు పెంచి చూపిస్తున్నారని ఇదంతా ఎందుకని ఆక్షేపించారు.

షరతుల ప్రకారం ఉచితాన్ని కూడా ఎక్కువ ధర లెక్క కడతారా? కేంద్రం చెప్పిన ప్రకారం అప్పు తెచ్చుకోగలిగిన
మొత్తం 1500 కోట్లు దాటదు. కాని స్మార్ట్‌ విూటర్లు బిగించడానికే వెయ్యికోట్లు కేటాయించినట్టు అధికారులు చెబుతున్నారు. పైగా దీన్ని అమలు చేయడానికి పర్యవేక్షించడానికి వివిధ స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు కానున్నాయన్నారు.

మొత్తంగా ఇవన్నీ కూడా సక్రమంగా సాగుతాయా అన్నదే ప్రశ్నని అన్నారు. దీనిని తెలంగాణలో లాగా వ్యతిరేకించాలన్నారు. రైతులకు ఉచిత విద్యుత్‌ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించడం తగదని అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు.

ఉచిత విద్యుత్‌కు మంగళం పాడేప్పుడు రెగ్యులరైజ్‌ చేయడం ఎందుకని నిలదీశారు. ప్రభుత్వమే ఉచిత విద్యుత్‌ బిల్లులు చెల్లించే పక్షంలో విూటర్ల ఏర్పాటు ఎందుకని అడిగారు.

విద్యుత్‌ విూటర్‌ల కోసం రూ.1000 కోట్ల ప్రజాధనం వృధా కాదా అని ఆయన మండిపడ్డారు. విూటర్ల రీడిరగు, నెలవారి బిల్లులు తీయటం, బిల్లుల చెల్లింపులు వంటి పనులు అదనపు భారం కాదా అని ప్రశ్నించారు.