Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

దేశంలో ఉచిత విద్యుత్‌ సాధ్యమా ?

వ్యవసాయానికి ఉభయ తెలుగు రాష్టాల్ల్రో ఉచిత విద్యుత్‌ ఇస్తున్నారు. సబ్సిడీలు అందిస్తున్నారు. ధాన్యం సజావుగానే కొంటున్నామని అంటున్నారు. పాలకులు, ప్రతిపక్ష నేతలు రైతు జపం చేస్తున్నా వారి జీవితాలు మాత్రం బాగుపడడం లేదు.

నిరతంర ఉచిత విద్యుత్‌ ఇస్తున్న తెలంగాణ తరహాలో దేశవ్యాప్తంగా ఇస్తామని ఇప్పటికే కెసిఆర్‌ ప్రకటించారు. ఆయన రేపటి ఎజెండా కూడా ఇదే కాబోతున్నది. దేశవ్యాప్తంగా రైతులకు ఉచిత నిరంతర విద్యుత్‌..24 గంటల కరెంట్‌ సరఫరా అన్న నినాదం మొగనుంది.

పార్టీ 22వ వార్షికోత్సవ వేడుకల్లో కూడా నేతలు ప్రధానంగా దీనినే ప్రస్తావించడం గమనార్హం. అయితే సరఫరాకు తగ్గట్లుగా ఉత్పత్తి కూడా ముఖ్యమే. దేశంలో సరిపడా విద్యుత్‌ ఉందా లేదా అన్న ఆలోచన చేయాలి. ఉత్పత్తి అవకాశాలు ఎంచుకోవాలి. సోలార్‌ విద్యుత్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడే విద్యుత్‌ సమృద్దిగా లభ్యత కాగలదు.

ALSO READ: ఆయన కక్ష రాజకీయాలు చేయలేదు.  
రాజకీయంగా కొత్త విద్యుత్‌ విధానాన్ని వ్యతిరేకించిన తెలంగాణ కూడా స్మార్ట్‌ విూటర్లను తెప్పించక తప్పని పరిస్థితి ఏర్పడబోతోంది. కేంద్రం ఒత్తిడి క్షేత్రస్థాయిలో రైతు అలజడికి కారణమవుతున్నది. ఇదంతా ఉచిత విద్యుత్‌ నుంచి దశలవారీగా తప్పుకునేందుకే అని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదే విషయాన్ని విపక్షాలు కూడా అంగీకరిస్తున్నాయి.

నగదుబదిలీ పథకం పేరుతో ఉచిత విద్యుత్తుకు వెన్నుపోటు పొడు స్తోందని వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తోందని టిడిపి అంటోంది. కేంద్రం షరతులను వ్యతిరేకించాల్సింది పోయి రాష్ట్ర ప్రభుత్వం ఇలా మెతక వైఖరి అవలంబిస్తూ రైతు ప్రయోజనాలను పణంగా పెట్టడం సమర్థనీయం కాదని ఆందోళన వ్యక్తం చేసింది.

ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉచిత విద్యుత్‌ సాధ్యమా అన్నది ఆలోచించాలి. అలాగే ఆ మేరకు మన ఉత్పాదకత ఉందా అన్నది కూడా ముఖ్యమే. అనేక గ్రామాలకు, బాయిలకు ఇప్పటికీ విద్యుత్‌ సరఫరా లేదు. అలాంటప్పుడు పంపిణీతో పాటు, లభ్యత కూడా సవాల్‌ కానుంది.

కెసిఆర్‌ ప్రకటన వినడానికి సులువుగానే ఉన్నా ఆచరణలో మాత్రం అంత సులువు కాదని గుర్తించాలి. ముందుగా దేశంలో నిరంతర విద్యుత్‌ కోసం కృషి జరగాలి. ఉన్న విద్యుత్‌ను ఇప్పుడు సరఫరా చేయడానికే సరిపోదు. విద్యతు ఉత్పాదకత పెంచకుండా ఉచిత విద్యుత్‌ సాధ్యం కాదని కూడా పాలకులు తెలుసుకోవాలి.

ఇకపోతే ఎపిలో 9గంటల ఉచిత కరెంట్‌ ఇస్తోంది. దీనికి విూటర్లు కూడా బిగిస్తోంది. వ్యవసాయ బావుల వద్ద విూటర్లు పెట్టడం వల్ల మంచి ఫలితాలు సాధించామని, విద్యుత్‌ కూడా ఆదా అయ్యిందని ఎపి సిఎం జగన్‌ పదేపదే చెబుతున్నారు. విజయనగరం జిల్లాలో మంచి ఫలితాలు సాధించామని అన్నారు. ఉచిత విద్యుత్‌ కొనసాగిస్తూనే ఎంత ఖర్చవుతుందో తెలుసుకోవడానికి దీనిని చేపట్టామని అన్నారు.

ALSO READ: తెలంగాణ హైకోర్టుకు వేస‌వి సెల‌వులు

అయితే తెలంగాణ సిఎం కెసిఆర్‌ మాత్రం మోటర్లకాడ విూటర్లు పెట్టనే పెట్టమని అంటున్నారు. అలాగే కార్పోరేట్‌ సోలార్‌ పవర్‌ కొనుగోళ్లకు కేంద్రం ఒత్తిడి చేస్తోందని మండిపడుతున్నారు. ఇకపోతే జాతీయపార్టీ పెట్టిన కెసిఆర్‌ దేశవ్యాప్తంగా ఉచిత విద్యుత్‌ ఇస్తామని అంటున్నారు. ఆయన ఎక్కడ బహిరంగ సభ పెట్టినా ఇదే విషయం చెబుతున్నారు.

అబ్‌కీ బాద్‌ కిసాన్‌ సర్కార్‌ అన్న నినాదం తలకు ఎత్తుకున్నారు. నిజానికి ఉచితాలు ఎంతవరకు అవసరమో చర్చ లేకుండా ఏదైనా ఉచితం అన్న నినాదం ఇప్పుడు రాజకీయ పార్టీలు పలవరిస్తున్నాయి. కెసిఆర్‌ జాతీయ రాజకీయాల్లో ఆకట్టుకోవడానికి ఇదే నినాదంగా మలచుకోబోతున్నారు.

గతంలో ఉమ్మడి ఎపిలో వైఎస్‌ ఇచ్చిన ఉచిత విద్యుత్‌ నినాదం టిడిపిని దెబ్బతీసింది. అందుకే ఇటీవల వరుసగా రైతు సంఘాలతో విూటింగ్‌లు పెట్టిన బాబు వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అందుకు ప్రాతిపదికగా ఉచిత విద్యుత్‌ నినాదం ఎత్తుకున్నారు. అధికశాతం ప్రజల జీవనాధారమైన వ్యవసాయరంగం పట్ల, రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతా రహితంగా
వ్యవహరిస్తున్నాయన్న విమర్శలు ఇప్పటికే ఉండగా..తాజాగా వ్యవసాయ విద్యుత్‌కు విూటర్ల బిగింపు ఇప్పుడు చర్చనీయాంశంగా..ఆందోళనకరంగా మారింది. ఎపిలో దీనికి సంబంధించిన అలజడి రేగుతోంది. ఉచిత విద్యత్‌ ఎత్తేసే కుట్ర అని విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.

ఇప్పటికే డిస్కంలకు కోట్ల రూపాయల బకాయలు పడ్డాయిన కేంద్రం ఆరోపిస్తోంది. విద్యుత్‌ నియంత్రణ బిల్లుకు నడుం బిగించిన కేంద్రం రాష్టాల్రపై ఒత్తిడి తెస్తోందన్న విమర్శలు ఉన్నాయి. విద్యుత్‌ నియంత్రణ అంతా ఇక కేంద్రం చేతిలోకి వెళితే రాష్టాల్రపై విద్యుత్‌ భారం తడిసి మోపెడు కానుంది. అదనపు అప్పులు తెచ్చుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాస్ట్రాలపై ఒత్తిడి పెంచింది.

ALSO READ: ఎమ్మెల్యేలను భర్తరఫ్ చేయాలి… ఈటల

ఉచిత విద్యుత్తు రైతుల హక్కుగా సాధించుకొన్నది. దానిని నగదు బదిలీ పేరిట ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై ఆధారపడినది గా మార్చి సంక్షేమ పథకాల సరసన చేర్చడంలో కేంద్రం ఒత్తిడి దాగి ఉంది. అసలే సంక్షోభంలో ఉన్న రైతాంగాన్ని నగదు బదిలీ పథకం ద్వారా మరింత సంక్షోభంలోకి నెడుతుంది.

ఇప్పటి వరకు వ్యవసాయం కోసం అందజేస్తున్న ఉచిత విద్యుత్తుకు ప్రభుత్వం ఎలాంటి బిల్లులను వసూలు చెయ్యడం లేదు. ఇకపై మాత్రం రైతులు విద్యుత్‌ బిల్లులను చెల్లించాల్సిందే. ఆ బిల్లుల మొత్తాన్ని రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని చెబుతున్న ప్పటికీ మున్ముందు ఈ పథకానికి ప్రభుత్వం నుంచి ముప్పు ఉండదని చెప్పే పరిస్థితి లేదు.

వ్యవసాయ విద్యుత్తుకయ్యే ఖర్చం తా ఇకపై ప్రభుత్వమే భరిస్తుంద న్నప్పుడు ఈ విద్యుత్‌ విూటర్ల కసరత్తంతా ఎందుకన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్‌ విూటర్లు బిగించాలన్న జగన్‌ ప్రభుత్వ నిర్ణయం విమర్శలను పక్కన పెట్టి కొనసాగి స్తోంది. అయితే ఇదంతా కేంద్రం ఒత్తిడి మేరకే అన్నది అందరికీ తెలిసిందే. అయినా విపక్ష టిడిపి దీనిపై విమర్శలు గుప్పిస్తూనే ఉంది.

ALSO READ: పుష్ప- 2 లో ఎన్టీఆర్ అతిధి పాత్రలో…

తెలంగాణలో అయితే విూటర్లు బిగించేది లేదని సిఎం కెసిఆర్‌ ఖరాఖండిగా చెప్పారు. అలాగే విద్యుత్‌ నియంత్రణ బిల్లును వ్యతిరేకిస్తా మని సిఎం కెసిఆర్‌ గతంలోనే ప్రకటించారు. భూమ్యాకాశాలను ఏకం చేస్తామన్నారు. ఇక కొత్తగా ప్రతి పాదించిన నగదు బదిలీ ప్రకారం ఒక్కో రైతు వ్యవసాయానికి ఎంత వాడుతున్నది ఖచ్చితంగా లెక్కగట్టి ఆ సొమ్మును తన ఖాతాకు బదలాయించి నగదుగా జమచేయాలన్నది ఈ పథకం ఉద్దేశ్యం.

స్మార్ట్‌గా ఉచిత విద్యుత్‌కు ఎసరు పెడతాయనే ఆందోళన రైతులు అందరిలో వుంది. రైతులపై ఒక్క రూపాయి కూడా భారం మోపబోమని ముప్పై ఏళ్లు ఉచితాన్ని కొనసాగించే సత్తా వుందని ముఖ్యమంత్రి జగన్‌ ,మంత్రులు చెబుతున్నా అనుమానాలు మాత్రం అలాగే వున్నాయి.

ఇప్పుడు ఈ విూటర్లు ప్రవేశ పెట్టడానికి కారణం కేంద్రంలోని మోడీ ప్రభుత్వ షరతు తప్ప రాష్ట్రం ఐచ్చికంగా చేస్తున్నది కాదన్న విమర్శలు ఉన్నాయి. మొత్తంగా సజావుగా సాగిపోతున్న ఉచిత వ్యవసాయ విద్యుత్‌లో అనేక ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.