Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఎమ్మెల్యేలను భర్తరఫ్ చేయాలి… ఈటల

జమ్మికుంట ఏప్రిల్ 28 (నిజం న్యూస్)

గురువారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ ప్రతినిధుల సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో దళిత బంధు కార్యక్రమం అమలులో అక్రమాలు చోటు చేసుకోవడం పై సీఎం కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్లు, అలాగే ఎమ్మెల్యేలపై సీరియస్ అయినట్లు ఓ వార్త వైరల్ గా మారింది.

హుజురాబాద్ పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కేసీఆర్ ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు. కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే దళిత బంధు పథకంలో మూడు లక్షల రూపాయలు తిన్న ఎమ్మెల్యేలను వెంటనే భర్త రఫ్ చేయాలని, ప్రతి ఒక్క దళితుడికి దళిత బంధు అందించాలని డిమాండ్ చేశారు.

Also read: ఏసీబీ కి పట్టుబడిన చారకొండ తాసిల్దార్

స్వయంగా సీఎం, ఎమ్మెల్యేలు వారి అనుచరులు దళిత బంధులో చేతివాటం చూపారని అన్నారంటే ఏ మేరకు అవినీతి జరిగిందో అర్థం అవుతుందన్నారు.

ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, మద్యం మాఫియా లాగా.. ఇప్పుడు దళిత బంధు అవినీతికి అడ్డాగా మారిందని విమర్శించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈటెల.