Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఏసీబీ కి పట్టుబడిన చారకొండ తాసిల్దార్

మాడ్గుల ఏప్రిల్ 28( నిజం న్యూస్):

నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో శుక్రవారం ఏసిబి డి.ఎస్.పి కృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు.

డి ఎస్ పి ఎసిబి శ్రీ కృష్ణ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం తాళ్ల రవీందర్ అనే వ్యక్తి రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం సంకటో నిపల్లికి చెందిన వ్యక్తి శ్రీపతిరావుకు చెందిన మాతృశ్రీ డెవలపర్స్ లో ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ గా పని చేస్తున్నారు. చారకొండ మండల కేంద్రంలోనిశేరి అప్పారెడ్డిపల్లి గ్రామంలో సర్వేనెంబర్ 120,121,122 లో 12 ఎకరాల భూమిని ఈనెల 7వ తేదీన 12 మంది పేర్ల మీద స్లోట్ బుక్ చేశారు.

Also read: ఉనికిని కోల్పోతున్న స్వతంత్ర సంస్థలు.

తాసిల్దార్ నాగమణి రిజిస్ట్రేషన్ చేయకుండా ఈనెల 14 తారీకు వరకు జాప్యం చేసి ఒక్కొక్క డాక్యుమెంట్కు 25 వేల చొప్పున లక్ష రూపాయల లంచంగా ఇవ్వాల్సిందని ఒప్పందం కుదుర్చుకున్నారు.

అనుకున్న విధంగా శుక్రవారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటల సమయంలో 75000/ రూపాయలు లంచంగా తాసిల్దార్ నాగమణికి ఇవ్వడానికి సిద్దం కాగా వీఆర్ఏ వందన భర్త వెంకటయ్యకు ఇవ్వాల్సిందిగా తాసిల్దార్ నాగమణి సూచించారు.

నగదు మొత్తాన్ని వీఆర్ఏ భర్త వెంకటయ్య కు ఇచ్చిన బాధితులు ఏసీబీకి సమాచారం అందించారు. వెంటనే రంగ ప్రవేశం చే సిన ఏసీబీ అధికారులు ఎమ్మార్వో నాగమణిని, ధరణి ఆపరేటర్ రాజుని, వీఆర్ఏ భర్త వెంకటయ్యని అదుపులోకి తీసుకొని విచారించగా తాసిల్దార్ నాగమణి ఒప్పుకున్నారు.

జడ్చర్ల లోని ఆమె స్వగృహంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.