చిన్నూ గూడ ,మార్క గూడ గ్రామాల సమస్యలను పరిష్కరించాలి
ఏజన్సీ ఆదివాసీ యూత్ ఫోరం జిల్లా అధ్యక్షులు గేడం నిరంజన్
ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో ఏప్రిల్ 27
(నిజం న్యూస్)
అదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఛాంబర్ లో ఏజెన్సీ ఆదివాసీ యూత్ ఫోరం తరపున గ్రామ సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు
*ఈసందర్భంగా సంఘ జిల్లా అధ్యక్షుడు గేడం నిరంజన్ మాట్లాడుతూ చిన్నూగూడ & మర్కగూడ గ్రామం గత కొన్ని సంవత్సారాలుగా కరెంటు,నీరు ఇబ్బందులు ఉన్నప్పటికీ , కొన్ని రోజుల కింద వడగళ్ల వాన పడటం వల్ల ఆదివాసీలు నివాసం ఉంటున్న ఇంటి పైకప్పులు చెడిపోయాయి
ఆదివాసుల బ్రతుకులు దయనీయంగా మారింది చవడమ బ్రతకడమా ఏఒక్క అధికారికుడా ఇటు వైపు చూసికూడా చూడనట్టు నటిస్తున్నారు కావున జిల్లా కలెక్టర్ గరే మాకు పెద్దదిక్కు అని అన్నారు.
గతంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఆ రెండు గ్రామ ప్రజలను గ్రామాల నుండి పల్లెలను ఖాళీ చెయ్యమని ఒత్తిడి చెయ్యడం జరిగింది
ఈ విషయమును జిల్లా కలెక్టర్ ని ఏజెన్సీ ఆదివాసీ యూత్ ఫోరం నుంచి విన్నపించుకోగా , జిల్లా కలెక్టర్ వారి గ్రామాలకు ఇబంది కలగకుండా చూడడం జరిగింది , ఫారెస్ట్ అధికారుల ఒత్తిడి నుండి పూర్తి విముక్తి కల్పించరూ
అతి త్వరలో కరెంట్ సౌకర్యం , చెడిపోయిన ఇంటి పైకప్పులకు రేకులు కల్పిస్తానని మాటఇవ్వడం జరిగింది
ALSO READ: అలియా భట్ ఉత్తమ నటిగా, రాజ్‌కుమార్ రావు ఉత్తమ నటుడిగా…ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్
కొన్ని సంవత్సారాలు నుండి నీటికోసం 2 కిలోమీటర్స్ వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు మా గ్రామం లోనే నీటి సదుపాయం కల్పించడం, ఫారెస్ట్ అధికారుల ఒత్తిడి నుండి విముక్తి కల్పిస్తామని మాట ఇచ్చిన గౌరవనీయులు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కి సంఘ తరపున నాయకులు సన్మానించారు సంతోషిస్తున్నాము.
చిన్ను గూడ , మర్క గూడ గ్రామస్తులకు చాలా సంతోషాన్ని కలిగించింది అని అన్నారు
అడవి ప్రాంతాల్లో నివసించే అందరి గిరిజనులపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాలని ఆదివాసీ పల్లెలకు ప్రజలకు కావలసిన సౌకర్యాలు కల్పించాలనికోరడం జరిగింది
అదే విధంగా మా గ్రామాలకు రోడ్ సౌకర్యం , అంగన్వాడీ కేంద్రం ఈ స్కూల్ సదుపాయాలు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నము.
ఏజెన్సీ ఆదివాసీ యూత్ ఫోరం జిల్లా అధ్యక్షులు గెడం నిరంజన్
*చిన్నూ గూడ ఆత్రం కశిరం పటేల్ , సిడం భింరవ్ పటేల్
ఎర్ర గుట్ట ఆత్రం సోనెరవ్ పటేల్
సొనేరవ్ గూడ పటేల్ దుర్వా మన్కు
మర్కగుడ గ్రామ పటేల్ కనక మాధవ్ రావ్తదితరులు పాల్గొన్నారు