Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

తోకలు  కత్తరిస్తా.. ఎమ్మెల్యేలకు సిఎం హెచ్చరిక

తెలంగాణ భవన్‌లో జరిగిన బీఆర్‌ఎస్ పార్టీ ప్లీనరీలో తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌ పార్టీ జెండాను ఎగురవేసిన అనంతరం పార్టీ జనరల్‌ బాడీ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు.

బీఆర్‌ఎస్‌ నేతలను కేసీఆర్‌ ‘తోకలు  కత్తరిస్తా’ అంటూ ఎమ్మెల్యేలను హెచ్చరించారు.

ఓ సర్వే రిపోర్టును ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లిన కేసీఆర్.. ఎమ్మెల్యేలను తమ నియోజకవర్గాల్లోనే ఉండి ప్రజల కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు.

“మీ ప్రాంతాలలో ఉండండి, ప్రజలకు అందుబాటులో ఉండండి. మీ గ్రాఫ్‌ను మెరుగుపరుచుకొండి

సరైన స్థాయిలో లేని ఎమ్మెల్యేల జాబితా నా వద్ద ఉందని, మరో రెండు నెలల్లో వారు ప్రవర్తన మార్చుకోకుంటే  వారి తోకలు  కత్తిరించి వేస్తానని, బీ-ఫారం నిరాకరించేందుకు వెనుకాడబోనని కేసీఆర్‌ ప్రకటించారు.

ALSO READ: పుష్ప- 2 లో ఎన్టీఆర్ అతిధి పాత్రలో…
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అధికారాన్ని నిలబెట్టుకోవడం ఖాయమని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

బీఆర్‌ఎస్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు భవిష్యత్తులో టీవీ ప్రకటనలు, సినిమా నిర్మాణాన్ని చేపట్టే అవకాశాలను అన్వేషించాలని పార్టీ నేతలకు సూచించారు.

ముందస్తు ఎన్నికలు లేవని స్పష్టం చేసిన కేసీఆర్.. షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు.