Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కిర్గుల్ (బి) గ్రామములో ఏడు ఇళ్లలో చోరీ

తాళం వేసిన ఇళ్ళు టార్గేట్

నగదు యాభై వేలు ,నగలు ఐదు తులాలు, మొబైల్ ఫోన్లు చోరీ

ముధోల్ నియోజకవర్గం ప్రతినిధి ఏప్రిల్ 27 (నిజం న్యూస్)

బాసర మండలంలోని కిర్గుల్(బి)గ్రామం లో ఎకంగా ఒకే రాత్రి ఐదు ఇళ్లలో చోరీ జరగడంతో ఒక్కసారిగా గ్రామములో అందరు హడలిపోయారు.తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకున్నారు.

ALSO READ: తగ్గుతున్న పత్తి ధర.. నష్టాల్లో రైతులు

ముందుగా ఫక్కి నిర్వహించి తాళం వున్నా ఇళ్ళు గుర్తించి,అర్ధరాత్రి ఒంటిగంట తరువాత చోరికి ప్రయత్నం చేసారు.సంఘటన సీఐ వినోద్ స్థలాలను సందర్శించి పరిశీలించారు.

అనంతరం ఆయన మాట్లాడుతు క్లూస్టీమ్ దర్యాప్తు కోసం పనిలో వున్నారని, గుర్తు తెలియని వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని,వివాహాల ద్రుష్ట్యా దాచుకున్నా నగలు,నగదు ఏమైనా ఇంటిలో వుంటే బ్యాంక్ లాకర్ లో పెట్టుకోవాలనీ, కనీసం ఇంటిలో రాత్రి సమయంలో ఒకరు వుండే విధంగ చూసుకోవాలనీ తెలిపారు.

ఈ విచారణలో ఎస్.ఐ లు విక్రమ్,మహేష్,పోలీసు సిబ్బంది పాల్గొన్నా