Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

తగ్గుతున్న పత్తి ధర.. నష్టాల్లో రైతులు

జమ్మికుంట, ఏప్రిల్ 27 (నిజం న్యూస్).తెల్ల బంగారంగా పిలవబడే పత్తి రైతులను నష్టాల్లోకి నెట్టుతుంది. పత్తి పంట వేసిన రైతులు నష్టాల్లో కూరుకుపోతున్నారు. పంట పండించాడనికి అప్పులు చేసి మరి రైతులు పండిస్తున్నారు.

అధిక దిగుబడి రాకపోవడానికి ప్రకృతి వైపరీత్యాలు కారణమైతే దానికి తోడుగా నకిలీ విత్తనాలు కూడా తయారయ్యాయి. నకిలీ విత్తనాల వాళ్ళ దిగుబడులు తగ్గిపోయాయి, దీనితో పాటు మార్కెట్ దళారులు మద్దతు ధర తగ్గించడంతో రైతులు కష్టాలు పడుతున్నారు.

ALSO READ: తెలంగాణ రైతులకు షాక్‌… రెండోసారి నష్టపోతే పరిహారం రాదు
వ్యాపారులు సిండికేట్లుగా మారి రైతులను నష్టాల్లో ముంచుతున్నారు. దీనితో పత్తి ధర భారీగా తగ్గిపోయింది. ఇప్పుడు పత్తి ధర మార్కెట్లో క్వింటాలుకు రూ.7500 నుండి రూ.7700 ధర పలుకుతుంది.

దిగుబడి తగ్గినా ధరలు బాగానే ఉంటాయి అనుకున్న రైతులకు నిరాశే మిగిలింది. పత్తి ని పండించిన రైతులు నష్టాల్లో మునుగుతున్నారు.