ఆస్తి కోసం కన్న తల్లినే చంపాడు…

దిశ వెబ్ డెస్క్: గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తికోసం కన్నతల్లినే చంపాడు ఓ కొడుకు. వివరాల్లోకెళితే…జిల్లాలోని రొంపిచర్ల మండలం అన్నవరంలో తల్లి కుందేటి తిరుపతమ్మ(80)పై ఆమె కొడుకు కుందేటి ఏడుకొండలు కర్రతో దాడి చేశాడు. దీంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. కాగా ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె మార్గం మధ్యలోనే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. కాగా ఘటనపై పోలీసులకు మృతురాలి బంధువులు ఫిర్యాదు చేశారు. నిందితుని కోసం పోలీసులు గాలిస్తున్నారు.