విపక్షాలకు మంత్రి బొత్స స్ట్రాంగ్ కౌంటర్

దిశ వెబ్ డెస్క్: విపక్షాల విమర్శలకు మంత్రి బొత్స సత్యనారాయణ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణ జరిపించడం తమ ప్రభుత్వ చిత్తశుద్దికి నిదర్శనమని అన్నారు. సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న తమ ప్రభుత్వం పై విపక్షాలు అపనిందలు వేస్తున్నాయని చెప్పారు. పుష్కరాల సమయంలో ఆలయాల కూల్చివేతను చంద్రబాబు మరిచి పోయారా అని ప్రశ్నించారు. చంద్రబాబులాగా తమ ప్రబుత్వం సీబీఐకి భయపడదని బొత్స తెలిపారు. Read Also… అమ్మిన భూములపై వారసుల పెత్తనం..!