Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఉపాధిపనులలో సంతకాల లొల్లి

:- ఎంపీడీఓ సమీక్షలో బైటపడ్డ కొత్త వివాదం.
:- 14 మంది ఎఫ్ ఎ లకు 74 గ్రామాలు.
కుబీర్ 🙁 నిజం న్యూస్ -) కూలీల వలసల నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిర్వహణ గాడితప్పి అభాసుపాలవుతున్న సంఘటన బుదవారం నిర్మల్ జిల్లా కుబీర్ మండల పరిషత్తు కార్యాలయం లో జరిగిన ఉపాధిపనుల సమిక్ష సమావేశంలో బైట పడింది.

వివరాలు ఈ విధంగా ఉన్నాయి కుబీర్ మండల పరిషత్ కార్యాలయంలో బుదవారం ఇంఛార్జి ఎంపీడీఓ కవిరాజ్ ఉపాధి పథకం సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా హంపోలి గ్రామ ఉపాధి పనుల మస్టర్ రోల్ పై పంచాయతీ కార్యదర్శి సంతకం పెట్టటం లేదని ఉపాధిపనుల క్షేత్ర సహాయకుడు సమీక్ష సమావేశంలోనే వాగ్వాదానికి దిగాడు.దీంతో ఎంపీడీఓ కవి రాజ్ స్పందిస్తూ కార్యదర్శిని ప్రశ్నించగా, పనులు చేసిన కూలీల వివరాలు తనకు తెలియదు అందుకే సంతకం చేయలేదని వివరణ ఇచ్చారు.

Also read: Google ఒక కొత్త ఫీచర్‌
*గ్రామాలకు తగ్గ క్షేత్ర సహాయకులు ఏరి?*
ఇది ఈలాగుంటే కుబీర్ మండలంలోని 74 గ్రామాలకు గాను 41 గ్రామపంచాయతీ లలో 14 మంది మాత్రమే క్షేత్ర సహయలుఉన్నారు. దీంతో ఒక్కో క్షేత్రసహాయకుడికి పరిదిలో 5 నుంచి 6 గ్రామాలు ఉన్నాయి.మండలంలో నిత్యం వేలాది మంది కూలీలు ఉపాధి పనులకు వెళుతున్నారు.

సీనియర్ మేట్ల వ్యవస్థ ఉన్నప్పటికీ, ఉపాధిహామీ పనులకు హాజరైన కూలీల హాజరు నమోదును క్షేత్ర సహాయాకులు మాత్రమే నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను పూర్తి చేయటానికి కూలీల సంఖ్యను బట్టి ఒక్క రోజు సమయం కూడా సరిపోదు,కానీ ఉపాధి పనులను ముగించుకుని కూలీలు మధ్యాహ్నం 12 గంటల లోపే ఇంటి దారి పడుతుండగా, హజరు నమోదు చేసే క్షేత్ర సహాయకులు సైతం వారి వెంటే ఒంటి గంటకే ఇంటి ముఖం పడుతుండటం కూలీల హాజరు నమోదు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

ప్రతి యేటా గ్రామీణాభివృద్ధి శాఖ నిర్వహించే ఉపాధి హామీ సామాజిక తనిఖీ ప్రజా వేదికల్లో అక్రమాలకు పాల్పడే ఉపాధి హామీ సిబ్బంది పై జిల్లా ప్రాజెక్టు అదికారులు రికవరిలు తప్ప కటిన చర్యలకు ఉపక్రమించక పోవటం ఈ సంక్షేమ పథకం పక్క దారి పట్టటానికి ప్రధాన కారణంగా మారిందనే విమర్శలు ఉన్నాయి.

కావున ఉన్నత అదికారులు ఇప్పటికైన స్పందించి విలసల నివారణ కొరకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లక్షం నెరవేరేలా పక్క ప్రణాళికతో ముందుకు సాగవలసిన అవసరం ఎంతైనా ఉందని మండల వాసులు కోరుతున్నారు.