వ్యాట్ పెంపు ‘సహజ’మే

దిశ వెబ్ డెస్క్: సహజవాయువుపై వ్యాట్ పెంచుతూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు 14.5 శాతం నుంచి 24.5 శాతానికి వ్యాట్ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా సంక్షేమ పథకాల నిధుల కోసమే వ్యాట్ పెంచినట్టు ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్ర రెవెన్యూ భారీగా పడిపోయిందని ఏపీ సర్కార్ వెల్లడించింది. ఆదాయ అంచనాల్లో 29.5 శాతమే వస్తోందని ప్రభుత్వం తెలిపింది. Read Also… విపక్షాలకు మంత్రి బొత్స స్ట్రాంగ్ కౌంటర్