Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కార్పొరేట్ దీటుగా ….. ప్రభుత్వ దవాఖాన

ఎమ్మెల్యే కృషితో 100 పడకల దవాఖా నిర్మాణం కోసం 44 కోట్లు తెలంగాణ ప్రభుత్వం మంజూరు పట్ల సర్వత్ర హర్షం.

నూతన దవాఖానకు త్వరలోనే ….ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు తో…. శంకు స్థాపన…

తుంగతుర్తి ఏప్రిల్ 26 నిజం న్యూస్

తుంగతుర్తి నియోజకవర్గంలో గతంలో ఎంతోమంది పాలకులు పాలించినప్పటికీ… నియోజకవర్గ కేంద్రంలో సామాజిక ఆరోగ్య కేంద్రం మొదట కొంతమంది డాక్టర్ల పనితీరు కృషితో కొంతకాలం రోగులకు సేవ చేసినప్పటికీ…. కాలక్రమమైన మనుగడకు నోచుకోలేక పదుల సంఖ్యలో ఉద్యోగాలకు భర్తీ చేయలేక కొంతమంది సిబ్బందితో…. పనులు నిర్వర్తిస్తూ… కాలం వెళ్ళు బుచ్చిన సంఘటన నియోజకవర్గంలోని ప్రజలందరికీ తెలిసిన విషయమే….

ప్రత్యేక రాష్ట్రం రాకముందు… రాష్ట్రం సాధించిన అనంతరం…. మొట్టమొదటిసారిగా తుంగతుర్తి నియోజకవర్గానికి తాను చదువుకున్న చదువును పక్కనపెట్టి, ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ సహకారంతో, సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రతి ఆరు నెలలకు ఒకసారి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని సుమారు 20 లక్షల పైగా మొదటిసారి ఖర్చు చేసి… దవాఖానకు రూపురేఖలు కల్పించిన ఘనత ఎమ్మెల్యే దేనని చెప్పక తప్పదు.

కరోనా సమయములో నియోజకవర్గ ప్రజలకు మేమున్నామంటూ ప్రభుత్వ దవాఖానాలు రోగులకు పరీక్షలు చేసి… ఇంటింటికి తిరుగుతూ మందులు పంపిణీ చేసి, కరోనా బూస్టర్ టీకాలు వేసి దవాఖాన సిబ్బంది ప్రజల మన్నెనలు పొందారు. ప్రస్తుతం దవాఖానాలో నార్మల్ డెలివరీ లు కూడా పెరిగిపోయాయి.

ALSO READ: విధి నిర్వహణలో ప్రతిభ కనపరిచిన పోలీస్ అధికారులకు, సిబ్బందికి ప్రోత్సహకాలు

రోజు రోజుకి నియోజకవర్గ అభివృద్ధి చెందుతూ… జాతీయ రహదారణ కలుపుతూ అంతర్ జిల్లాలు వెళుతున్నందున రహదారులపై కూడా ప్రమాదాలు చోటు చేసుకుంటూ… ఏకంగా రోగులు దవాఖానకు వస్తున్నారు. వీరికి మెరుగైన చికిత్సలు అందిస్తేనే ప్రాణం మిగులుతుంది… లేనియెడల సుమారు 40 కిలోమీటర్లు పోవాలంటే ఎంతోమంది రోగులు ప్రాణాలు సైతం పోగొట్టుకున్నారు.

ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు ఎమ్మెల్యే పలుమార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ , ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చర్చలు జరిపి, కార్పొరేట్ దీటుగా వంద పడకల ఆసుపత్రి మంజూరితో సకల సౌకర్యాలతో, అన్ని శాఖల డాక్టర్లు నియామకంతో 44 కోట్ల రూపాయల నిధులతో, రూపుదిద్దుకోబోతున్నది..

ఈ నూతన దవాఖాన శంకుస్థాపనకు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖామంత్రి హరీష్ రావు శంకుస్థాపన కార్యక్రమానికి రానున్నట్లు, ఏకంగా ప్లీనరీలో ఎమ్మెల్యే ప్రకటించారు. దీనితో నియోజకవర్గ వివిధ పార్టీల నాయకులు, నూతన దవాఖా నిర్మాణానికి నాంది పలకడంతో సంఘ నాయకులు, మేధావులు, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు…

కార్పోరేటుకు దీటుగా … తుంగతుర్తి లో 100 పడకల ఆసుపత్రి

ఎంపీటీసీ….. చెరుకు సృజన పరమేశ్ …తుంగతుర్తి.

నియోజకవర్గంలో గడిచిన కొన్ని సంవత్సరాలుగా మండల కేంద్రంలో సామాజిక ఆరోగ్య కేంద్రం మాత్రమే ఉన్నది. ప్రజలు చాలా ఇబ్బందులు పడేవారు.. సమయానికి డాక్టర్ ఉండకపోగా ప్రమాదాలు జరిగితే ప్రాణాలు పోయేవి. ఉద్యమ నాయకుడు ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ ఎమ్మెల్యే అనంతరం పలుదాపాలుగా ప్రత్యేక నిధులు మంజూరు చేశాడు. దీనితో అభివృద్ధి చెంది.. ప్రజలకు ఆరోగ్య సిబ్బంది సేవలు కల్పిస్తున్నారు. నియోజకవర్గ ప్రజల అదృష్టం మేరకు 100 పడక దవాఖాన కోసం 44 కోట్లు మంజూరు చేయడం అభినందనీయం. రానున్న రోజుల్లో కార్పొరేట్ దవాఖానగా రూపుదిద్దుకోనున్నది. ప్రత్యేక నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ కు పేద ప్రజలు రుణపడి ఉంటారని అన్నారు…