Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

55 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ ను ఓడించిన గుజరాత్ టైటాన్స్

అహ్మదాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మంగళవారం  జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 55 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది.

శుభ్‌మాన్ గిల్  34 బంతుల్లో 56 పరుగులు చేయడం తో  గుజరాత్ టైటాన్స్‌ ఆరు వికెట్లకు 207 పరుగులకు చేసింది .
డేవిడ్ మిల్లర్ 22 బంతుల్లో 46 పరుగులు చేయగా, అభినవ్ మనోహర్ 21 బంతుల్లో 42 పరుగులు చేయడంతో గుజరాత్ టైటాన్స్ చివరి నాలుగు ఓవర్లలో 70 పరుగులు జోడించి 200 పరుగుల మార్కును దాటింది.

ALSO READ: 4 రోజుల్లో 50 కోట్లు వసూలు చేసిన విరూపాక్ష

MI బౌలర్లలో  లెగ్ స్పిన్నర్ పీయూష్ చావ్లా 34 పరుగులకు 2 వికెట్లను  సాధించాడు.
MI  తొమ్మిది వికెట్ల నష్టానికి 152 పరుగులకే పరిమితమయింది

ఎడమచేతి వాటం ఆఫ్ఘన్ స్పిన్నర్ నూర్ అహ్మద్ (3/37) GT బౌలర్ అత్యుత్తమ ప్రతిభ కనపర్చాడు.

సంక్షిప్త స్కోర్లు:
గుజరాత్ టైటాన్స్: 20 ఓవర్లలో 6 వికెట్లకు 207 (శుబ్మాన్ గిల్ 56, డేవిడ్ మిల్లర్ 46, అభినవ్ మనోహర్ 42; పీయూష్ చావ్లా 2/34).
ముంబై ఇండియన్స్: 20 ఓవర్లలో 9 వికెట్లకు 152 (టిమ్ డేవిడ్ 40, కెమరూన్ గ్రీన్ 33; నూర్ అహ్మద్ 3/34).