ఆగస్టులో భారతీయులు ఏం సెర్చ్ చేశారంటే?

ఏ చిన్న అవసరానికైనా గూగుల్ తల్లే దిక్కు. కానీ మనం అడిగేవన్నింటినీ గూగుల్ తల్లి గుర్తుపెట్టుకుని ప్రతి నెలా విశ్లేషిస్తుంది. ఈ క్రమంలోనే గత నెలలో భారతీయ వినియోగదారులు ఆ తల్లిని ఏమేం అడిగారనే విషయాన్ని గూగుల్ విడుదల చేసింది. అందరూ ఊహించినట్లుగా ఎక్కువగా సెర్చ్ ఇంట్రెస్ట్ గల పదాల్లో కొవిడ్ 19, కొవిడ్ వ్యాక్సిన్ ఉన్నాయి. అయితే వీటితో పాటు ఇండిపెండెన్స్ డే, ప్రణబ్ ముఖర్జీ, పాకిస్థాన్ వర్సెస్ ఇంగ్లండ్ పదాలు కూడా టాప్ స్థానాల్లో నిలిచాయి. గూగుల్ విడుదల చేసిన వివరాల ప్రకారం, పాకిస్థాన్ వర్సెస్ ఇంగ్లండ్ పదానికి 5000 శాతానికి మించి సెర్చ్ ఇంట్రెస్ట్ వచ్చినట్లు తెలుస్తోంది. తర్వాతి స్థానంలో 4000 శాతం సెర్చ్ ఇంట్రెస్ట్‌తో ప్రణబ్ ముఖర్జీ పదం నిలిచింది.