ఖజానా గుల్లవుతున్నా పట్టింపు ఏదీ

ఎపిలో ఉచిత పథకాల జోరు
ఆచరణ సాధ్యం కాని హావిూలతో గుల్ల
ఖజానాను తోడేస్తున్న ఉచిత పథకాలు
పాలకులు ఆత్మవిమర్శ చేసుకోకుంటే పతనమే
విజయవాడ,ఏప్రిల్25: ఆచరణ సాధ్యం కాని హావిూలు ఇవ్వడంపై దేశ వ్యాప్తంగా అన్ని స్థాయిలలో చర్చ జరగాల్సి ఉంది. జగన్ తన చేతికి ఎముక లేదన్నట్లుగా చేస్తున్న పందేరాల వల్ల ఖజానా వట్టిపోయింది. ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టమని అధికారును సిఎం జగన్ పదేపదే పురమాయిస్తున్నారు.
హావిూలు ఇచ్చిన నేతలు అధికారంలోకి వచ్చాక డబ్బులను పందేరం చేస్తూ అభివృద్దిని కుంటుపడేస్తు న్నారు. దాదాపుగగా అన్ని రాష్టాల్ల్రో ఉచిత డబ్బు పంపిణీ అన్నది ఓ నినాదంగా మారింది.
ఎపిలో జగన్ చేస్తున్న డబ్బుల పందేరం బహుశా దేశంలో ఎక్కడా ఉండదేమో. అధికారం కోసం రాజకీయ పక్షాలు బాధ్యతారహితంగా హావిూలు గుప్పిస్తున్నాయి. రాష్టాల్ల్రో ఉచిత హావిూలుకాని, ఆచరణ సాధ్యం కాని వాగ్దానాలు అనేకం చేస్తున్నా వాటిని పట్టించుకోవడం లేదు.
ALSO READ: కప్పలతక్కెడ లాంటి కాంగ్రెస్‌ను కాపాడడం ఎవరి తరం కాదు..?
ప్రస్తుత రాజకీయాలతో పాటు, ఇతర వ్యవస్థలలో వేళ్లూనుకుంటున్న కులం, మతం, ప్రాంతీయ తత్వాలు దేశానికి చాలా ప్రమాద కరమని గుర్తించడం లేదు. కులం, డబ్బు, మతం, నేర స్వభావాలకు పెద్దపీట వేస్తున్నారు.ఆచరణ సాధ్యం కాని హావిూలను ఇచ్చి ప్రజలను మోసం చేసే కన్నా అసాధ్యం అని నేతలు లేదా పాలకులు చెప్పలేక పోతున్నారు.
నాయకులంతా నిర్దిష్టంగా చెప్పగలిగి ఉండాలి. అలాగే ఏ స్కీములు వృధా అయినవో వివరించాలి. అలాకాకుండా ప్రభుత్వం అనేక సంక్షేమ పధకాలను అమలు చేస్తున్న నేపథ్యంలో వాటిని గొప్పగా ప్రకటించుకోవడం సరికాదు. దీంతో ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉంటుంది.
రైతు రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించడం ఏటా జరుగుతోంది. దీనిపై గగతంలోనే ఆర్‌బిఐ ఓ మారు హెచ్చరించింది. వందల కొద్ది హావిూలు ఇచ్చినప్పుడు వాటిని అమలు చేయగలమా లేదా అని అధికారంలోకి వచ్చివారు ఆలోచించడం లేదు. పార్టీతో తమకు ఏమి సంబంధం అని తప్పించుకోవచ్చు. కాని ఎన్నికల్లో ప్రచారం చేసిన విషయాన్ని ప్రజలు మర్చిపోరు అన్నది గుర్తించాలి.
ఎపికి ప్రత్యేక హోదాపై ఇచ్చిన హావిూ ఆచరణ సాధ్యం కాలేదు. దానిని కప్పిపుచ్చుకునేందుకు బిజెపి నానా తంటాలు పడిరది. అది సాధ్యమైనదే అయితే కేంద్రం ఎందుకు ఇవ్వడం లేదన్నది ఆలోచన చేయాలి. తెలంగాణలో దళితులకు పదిలక్షల రూపాయల ఆర్ధిక సాయం చేస్తామని బిఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. నిజానికి ఇది సాధ్యమయ్యేది కాదు. ఇలా చేయడం వల్ల ఖజానాపై భారం పడుతుంది. దీనిపై కెసిఆర్ ఆలోచన చేయడం లేదు. అలాగని వారిని పక్కన పెట్టాలని కాదు..వారికి ఉద్యోగ, ఉపాధి కోసం ఆలోచన చేయాలి.
కులం,మతం, చూడవద్దు, ప్రాంతం, పార్టీ అని చూడకుండా కార్యక్రమాలను మాత్రం ముందుకు తీసుకుని వెళ్లాలి. ఆయా సంక్షేమ పధకాలను గుదిబండగా కాకుండా అబివృద్దికి ఆనవాళ్లుగా చేయాలి. ఒకప్పుడు ఎన్.టి.ఆర్. రెండు రూపాయలకే కిలో బియ్యం ఇస్తానంటే అప్పటి ఇతర రాజకీయ పక్షాలు ఆయనను తీవ్రంగా విమర్శించాయి. అవే పార్టీలు దానిని కిలో రూపాయికే బియ్యంగా మార్చాయి.
ఇది ప్రజలపై ఎంతటి భారాన్నిమోపుతుందో పాలకులు గమనించడం లేదు. ఇలాంటి పథకాలనుఏ పక్న పెట్టాలి. డబ్బుల పందురాన్ని పక్కన పెట్టి అభివృద్ది కార్యక్రమాలకు పెద్దపీట వేయాలి. వనరులును ఉపయోగించి సంపద సృష్టించాలి. అప్పుడే దేశం బాగుపడగలదని సిపిఐ నేత రామకృష్ణ అన్నారు. ఉచిత పథకాలతో ప్రజల జీవన ప్రమాణాలను దెబ్బతీయవద్దన్నారు.