Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరలు ఏప్రిల్ 25న పెరిగాయి.

పసిడి రేటు రూ. 220 మేర ర్యాలీ చేసింది. దీంతో బంగారం ధర రూ. 60,930కు చేరింది. 24 క్యారెట్ల బంగారానికి ఇది వర్తిస్తుంది. అలాగే 10 గ్రాములకు ఈ రేటు ఉంది.

ALSO READ: ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఇక 22 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే.. దీని రేటు కూడా రూ. 200 పెరిగింది. దీంతో ఈ పసిడి రేటు రూ. 55,850కు చేరింది. పది గ్రాములకు ఈ రేటు వర్తిస్తుంది.

కాగా ఈ ఆర్నమెంటల్ గోల్డ్ రేటు మూడు రోజులుగా తగ్గుతూ వచ్చిన విషయం తెలిసిందే.

బంగారం ధరలు పెరిగితే.. వెండి రేటు కూడా జిగేల్ మంది. పైపైకి పరుగులు పెట్టింది.

వెండి రేటు ఈ రోజు భారీగా జంప్ కొట్టింది. సిల్వర్ రేటు రూ. 700 దూసుకుపోయింది. దీంతో వెండి ధర కేజీకి రూ. 80,700కు చేరింది