Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఒకే రోజు నాలుగు పరీక్షలు.. ఆందోళనలో అభ్యర్ధులు

జమ్మికుంట, ఏప్రిల్ 25 (నిజం న్యూస్)

తెలంగాణలో ఒక్కరోజే 4 ఉద్యోగాలకు సంబంధించి పరీక్షలను నిర్వహిస్తున్నారు. దీంతో అభ్యర్థులు ఆందోళనకు గురి అవుతున్నారు. ఏ పరీక్ష రాయాలో తేల్చుకోలేక పోతున్నారు.
తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ( TSSPDCL ) భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. దీని నుంచి జూనియర్ లైన్మెన్, అసిస్టెంట్ ఇంజనీర్ నియామకాలకు సంబంధించి రెండు నోటిఫికేషన్లు విడుదల అయిన విషయం తెలిసిందే. మొత్తం 1,601 పోస్టులున్నాయి.

ALSO READ: ముస్లిం కోటాను రద్దు చేస్తామన్న అమిత్ షా పై మండిపడ్డ అసదుద్దీన్ ఒవైసీ

అందులో అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ పోస్టులు 48 కాగా, జూనియర్ లైన్మెన్ పోస్టులు 1553. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం జూనియర్ లైన్మెన్ పోస్టుల కోసం ఆన్లైన్ దరఖాస్తు మార్చి 8 నుంచి ప్రారంభం కాగా.. అభ్యర్థులు మార్చి 28 వరకు ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది.

అయితే వీటికి పరీక్ష తేదీను ఏప్రిల్ 30న నిర్ణయించారు. తాజాగా హాల్ టికెట్స్ ను విడుదల చేశారు. అభ్యర్థులు TSSPDCL వెబ్సైట్ tssouthernpower.cgg.gov.in ని సందర్శించి తమ హాల్ టికెట్స్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఏప్రిల్ 30న మొత్తం రాష్ట్రంలోనే నాలుగు పరీక్షలు ఉన్నాయి.

ఏప్రిల్ 30న మొత్తం రాష్ట్రంలోనే నాలుగు పరీక్షలు ఉన్నాయి. TSSPDCL పరీక్షలను వాయిదా వేయాలని నిరుద్యోగులు విజ్ఞప్తి చేసినా బోర్డు పెడచెవిన పెట్టింది. పరీక్ష తేదీ మార్చేది లేదంటూ.. హాల్ టికెట్స్ ను విడుదల చేసింది.

ఇదిలా ఉండగా.. అదే రోజు TSLPRB సివిల్ కానిస్టేబుల్, ఐటీ కానిస్టేబుల్ కు సంబంధించి మెయిన్స్ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఇలా మొత్తం ఒకే రోజు నాలుగు పరీక్షలు ఉండటంతో.. అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటు కానిస్టేబుల్ పరీక్ష.. అటు లైనమెన్ / ఏఈ పరీక్ష ఉండటంతో ఏ పరీక్ష రాయాలో తేల్చుకోలేకపోతున్నారు.