Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

జర్నలిస్టుల కలను నెరవేర్చిన శానంపూడి సైదన్న

– గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉండి కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వలేని ఉత్తమ్‌
– చెప్పిన మాటను చేసి చూపించిన ఎమ్మెల్యే
– 140 గజాలను ఇచ్చి తమది జర్నలిస్టుల సంక్షేమ ప్రభుత్వమని నిరూపించిన సైదన్న
– పట్టాలను అందుకున్న జర్నలిస్ట్‌ ల కళ్ళలో ఆనందబాష్పాలు
హుజూర్‌ నగర్‌, ఏప్రిల్‌ 24(నిజం న్యూస్‌):

మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో హుజూర్నగర్‌ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేసారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ… ఈ మూడు సంవత్సరాల్లో ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను 100 శాతం నెరవేర్చడం జరుగుతుందన్నారు.
తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేస్తామన్న చెప్పిన మాటను ఈరోజు చేతల్లో చూపిస్తున్నామని, పని ఒత్తిడిల కారణంగా కొంత ఆలస్యమైనా ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ నా చేతుల మీదుగా జర్నలిస్టులకు అందజేయడం చాలా సంతోషకరంగా ఉందని హుజూర్‌నగర్‌ ఎమ్మేల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు.

ALSO READ: కానిస్టేబుల్ పోస్టుల తుది రాత పరీక్ష హల్ టిక్కెట్లు విడుదల

గత కాంగ్రేస్‌ ప్రభుత్వంలో ఉత్తంకుమార్‌ రెడ్డి గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో 70 గజాలు విలేకరులకు ఇస్తామని ప్రకటించి కూడా ఇవ్వలేకపోయారని, నేడు బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో 140 గజాల ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.
రాష్ట్రంలో ఈ విధంగా ఇండ్ల స్థలాల పంపిణీ జరిగిన నియోజకవర్గంలో హుజూర్నగర్‌ రెండవదని తెలిపారు.
జర్నలిస్టులు ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి చేతుల మీదుగా ఇళ్ల స్థలాల పట్టాలను అందుకుంటూ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.

తమ ఇన్నేళ్ల కలను ఈరోజు ఎమ్మెల్యే నిజం చేశారని, ఎమ్మెల్యే చెప్పిన మాటను తప్పకుండా నిజం చేస్తారని అందరూ అంటుంటే నమ్మలేదని కానీ ఈరోజు తమకు పట్టాలను అందజేసి నమ్మశక్యం కాని పనిని చేసి నిరూపించారన్నారు.

హుజూర్నగర్‌ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో శరవేగంగా ముందుకు తీసుకొని వెళ్తున్నారని, ఇంటి స్థలాల పట్టాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో హుజూర్నగర్‌ పట్టణ మున్సిపాలిటీ చైర్మన్‌ గెల్లిఅర్చనరవి, హుజూర్నగర్‌ ఆర్‌డిఓ వెంకా రెడ్డి, ఎమ్మార్వో కమలాకర్‌ పాల్గొన్నారు