Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

భారీగా దిగొచ్చిన బంగారం ధర..

-వెండి రూ.1,300 పతనం

జమ్మికుంట, ఏప్రిల్ 24 (నిజం న్యూస్)

హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గాయి. బంగారం ధర మూడు రోజుల కాలంలో దాదాపు రూ. 440 మేర పడిపోయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు ఇది వర్తిస్తుంది.

పసిడి రేటు ఈ కాలంలో రూ. 61,150 నుంచి రూ. 60,710కు తగ్గింది.22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఈ ఆర్నమెంటల్ గోల్డ్ రేటు కూడా రూ. 400 దిగి వచ్చింది.

ALSO READ: ట్రిపుల్ ఐటీలో వివాదం

రూ. 56,050 నుంచి రూ. 55,650కు పడిపోయింది. పది గ్రాముల బంగారానికి ఈ రేటు వర్తిస్తుంది.

వెండి రేటు కూడా దిగి వచ్చింది. సిల్వర్ రేటు కూడా భారీగానే దిగి వచ్చింది.

వెండి ధర ఏకంగా రూ. 1300 పడిపోయింది. రూ. 81,300 నుంచి రూ. 80 వేలకు క్షీణించింది.

వెండి కొనాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు.