ద్వేషాన్ని సొమ్ము చేసుకుంటున్న ఫేస్‌బుక్?

వెబ్‌డెస్క్: తప్పుడు సమాచారం విషయంలో, ద్వేషపూరిత కంటెంట్ విషయంలో ఫేస్‌బుక్ మొదట్నుంచీ విమర్శలు ఎదుర్కొంటూనే ఉంది. ఇప్పుడు కొత్తగా ఆ విమర్శలన్నీ నిజమేనని చెప్పే విషయమొకటి బయటి ప్రపంచానికి తెలిసింది. ప్రపంచంలో ద్వేషాన్ని పుట్టించి దాని మీద ఫేస్‌బుక్ సొమ్ము చేసుకుంటోందని ఆ సంస్థ నుంచి ఇటీవల రాజీనామా చేసిన ఓ ఉద్యోగి వెల్లడించం గమనార్హం. అతని రాజీనామకు అది కూడా ఒక కారణమని తెలియజేస్తూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అశోక్ చంద్వానీ ఒక లెటర్ ద్వారా తెలియజేశారు. ప్రత్యేకంగా, మిలిటెంట్‌ల గ్రూప్‌ల ఈవెంట్లను తొలగించడంలో ఫేస్‌బుక్ విఫలమైందని ఆయన ఆరోపించారు. అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెట్టిన ద్వేషపూరిత పోస్ట్‌ను ఫేస్‌బుక్ ప్రోత్సహించడం తనకు నచ్చలేదని అశోక్ పేర్కొన్నారు.