ట్రిపుల్ ఐటీలో వివాదం
హౌస్ కీపింగ్ కార్మికులను బెదిరించిన కాంట్రాక్టర్
ఐదుగురి సస్పెన్షన్ తో 200 నిరసన
ముధోల్ నియోజకవర్గం ప్రతినిధి ఏప్రిల్ 24 (నిజం న్యూస్)
నిర్మల్ జిల్లా బాసర మండలకేంద్రంలోని బాసర ట్రిపుల్ ఐ.టి లో పనిచేస్తున్న హౌస్ కీపింగ్ కార్మికుల సమస్య తెరపైకి వచ్చింది.కొన్ని నెలలుగా అంతర్గతంగా వున్న సమస్య ఒక్కసారిగా తీవ్రస్థాయి కావటంతో సిబ్బంధి ప్రధాన ద్వారం వద్ద నిరసన వ్యక్తం చేసారు.
ప్రతి నెల అందించే జీతం డబ్బులు, పిఎఫ్, ఈఎస్ఐ డబ్బులు అడిగితే కాంట్రాక్టర్ బెదిరిస్తున్నారని, గత రెండు రోజుల క్రితం రంజాన్ పండుగకు డబ్బులు లేవని జీతం చెల్లించాలని అడుగగా ఇవ్వలేదని తెలిపారు.
సరియైన సమయంలో జీతం,ఇఎస్ఐ,పిఎఫ్ చెల్లించాలనీ, వివరాలు అదిగినందుకు ఐదుగురు సిబ్బందిని బహిష్కరించి విధులకు రావద్దని మెమో జారీ చేశారు.
ALSO READ: అసైన్డ్ భూములు అక్రమిస్తే …6 నెలల జైలు శిక్ష
సోమవారం విధుల్లోకి రాగానే ఆపేసిన సెక్యూరిటీ సిబ్బంది ఆపివేయడంతో బహిష్కరించవద్దని తమ న్యాయపరమైన డిమాండ్లను అడిగినందుకు బహిష్కరిస్తారా అంటూ విధులను బహిష్కరించి, త్రిబుల్ ఐటీ ప్రధాన ద్వారం ముందు సుమారు మూడు గంటల పాటు బాసర త్రిబుల్ ఐటీలో 200 మంది హౌస్ కీపింగ్ కార్మికులు విధులను మానేసి నిరసన తెలిపారు.ఇ.ఎస్.ఐ లో వివరాలు పొందుపరచక పోవటంతో హాస్పిటల్ లో అవస్థలు పడ్డానని కొంతమంది వాపోయారు.
మద్దతుగా నిలిచిన బాసర సర్పంచి లక్ష్మణరావు,జిడ్డు సుభాష్ యాదవ్
బాసర త్రిబుల్ ఐటీ ముందు ఎండలో కూర్చుని నిరసన వ్యక్తపరుస్తున్న హౌస్ కీపింగ్ కార్మికులకు మద్దతుగా బాసర సర్పంచి లక్ష్మణరావు నిలిచారు.ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్న కాంట్రాక్టర్ను తొలగించాలని, లేనియెడల వాళ్లకి సరైన న్యాయం జరిగే విధంగా ఏర్పాట్లు చేయాలని , ఈఎస్ఐ, పిఎఫ్ డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసారు. బాసర త్రిబుల్ ఐటీ హౌస్ కీపింగ్ కార్మికులకు పూర్తి న్యాయం చేస్తామని కలెక్టర్, మంత్రి,ఎమ్మెల్యేలకు విన్నవిస్తానని హామీ ఇచ్చారు