Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ప్రకృతి ప్రసాదించిన చద్దిముంత ముంజకాయ

తూర్పుగోదావరి జిల్లా..ఏప్రిల్ 24..నిజం న్యూస్

ప్రకృతి కన్నతల్లి లాంటి ప్రేమతో మానవుడికి రుతువులకు తగినట్లు అనేక పండ్లను అందిస్తుంది.వాటిలో వేసవిలో మన ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రకృతి ప్రసాదించిన తాటిముంజలు చాలా ప్రత్యేకమైనవి.
గోదావరి జిల్లాలలోనే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా తాటిముంజలపై ప్రతీ ఒక్కరికీ అమితమైన మక్కువ ఉంటుంది.ఈ సందర్బంగా నిపుణులు వివిధ సందర్భాలలో వివరించిన ఈ తాటి ముంజల ప్రయోజనాలు ప్రత్యేకంగా మన నిజం పత్రిక పాఠకుల కోసం..

తాటిముంజలను పిల్లలు, పెద్దలు వయసుతో సంబందం లేకుండా అందరూ అమితంగా ఇష్టపడతారు.ఇవి కల్తీకి ఆస్కారం లేని స్వచ్చమైనవి. మండుటెండల నుండి మంచి ఉపశమనం తాటిముంజలు ద్వారా లభిస్తుంది.

ఈ తాటిముంజలు శరీరంలోని చక్కెర,ఖనిజాల ప్రమాణాలను సమతుల్యం చేస్తాయి.తాటి ముంజల్లో విటమిన్ బి7, విటమిన్ కె, సోలెబుల్ ఫైబర్, పొటాషియం,క్యాల్షియం, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ డి,జింక్, ఐరన్‌లతో పాటు న్యూట్రిన్స్ ఉంటాయి.

వీటిలో నీటిశాతం ఎక్కువ ఉండటం వల్ల వేసవిలో వడదెబ్బ తగలకుండా చేస్తాయి.ఇవి శరీర ఉష్ణోగ్రతను తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తాయి.
వీటిలో ఉండే అధిక నీటిశాతం శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా చేసి శరీరానికి చలువని అందిస్తాయి. తాటిముంజల్లో పొటాషియం సమృద్ధిగా ఉండడం వలన రక్తపోటు అదుపులో ఉండి గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి.

అంతే కాకుండా ఇవి శరీరంలోని హానికర వ్యర్థ పదార్థాలను తొలగించడంలో అద్భుతంగా పని చేస్తుంది.తాటిముంజల్ని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా లివర్ సంబంధిత సమస్యలను తగ్గించుకోవచ్చు.

ALSO READ: ఒక్క ఛాన్స్ ఇవ్వండని అడుక్కుంటున్న బండి
తాటి ముంజలు తినడం వలన చెడు కొలస్ట్రాల్ పోయి మంచి కొలస్ట్రాల్ వృద్ధి చెందుతుంది.తాటి ముంజల్లో ఉండే పోషకాలు జీర్ణ సంబందిత సమస్యను తగ్గిస్తాయి.వీటిని తినడం వలన తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణమై గ్యాస్, ఎసిడిటి,కడుపు ఉబ్బరంగా ఉండే ఉదర సంబందిత సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి.

వేసవిలో ఎండ కారణంగా వచ్చే వికారం, వాంతులను నివారిస్తుంది. మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలను బాగా తగ్గిస్తుంది. వేసవిలో వచ్చే చికెన్ పాక్స్‌ని సమర్ధవంతగా నివారించి,శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.అలాగే శరారంలోని అధిక బరువుని తగ్గించేందుకు తాటి ముంజలు ఎంతో సహాయపడతాయి.
ఇక సౌందర్య సాధనంగా కూడా తాటి ముంజలు ఉపయోగపడతాయి.తాటి ముంజల్ని గుజ్జుగా చేసి ముఖానికి పైపూతలా వేసుకుంటే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.ఇది చర్మానికి కావల్సినంత తేమను అందించి వేసవి కాలంలో వచ్చే చెమటకాయల్ని నివారిస్తుంది. అలాగే ఎండ వేడిమి వల్ల ముఖంపై ఏర్పడే మచ్చలను తగ్గిస్తుంది.

ఇన్ని అద్భుతమైన ప్రయోజనాలు ఉన్న తాటిముంజలు తినడం వల్ల లెక్కకు మించి ప్రయోజనాలు ఉన్నాయి.కాని రాను రాను తాటి చెట్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. ఇంతకుముందు పొలం గట్లపై,కాలువ గట్లుపై అధిక సంఖ్యలో ఉండే తాటిచెట్లు ప్రస్తుతం పరిమిత సంఖ్యలో మాత్రమే కనిపిస్తున్నాయి.

యాంత్రికరణ విధానాలు,అలాగే రియల్ ఎస్టేట్ పేరుతో వ్యవసాయ భూములను నివాస స్థలాలుగా మార్చడం వలన తాటి చెట్లు తమ ఉనికిని కోల్పోతున్నాయి.