Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఒక్క ఛాన్స్ ఇవ్వండని అడుక్కుంటున్న బండి

తెలంగాణకు బిజెపి ఏం చేసింది ఏం చేయాలనుకున్నారో చెప్పలేకపోయిన షా

– అమిత్ షా వ్యాఖ్యాలను ఖండించిన ఎంపీ రంజిత్ రెడ్డి

-రాష్ట్ర అభివృద్ధిలో బిజెపి పాత్ర శూన్యం

– కాలేశ్వరం ప్రాజెక్టుకు పైసా ఇవ్వని బిజెపి.

చేవెళ్ల ఏప్రిల్ 24(నిజం న్యూస్):
బిజెపి విజయ సంకల్ప సభలో అమిత్ షా తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారో ఏం చేయాలనుకున్నారో సభ ద్వారా అమిత్ షా చెప్పలేకపోయారని ఎంపీ రంజిత్ రెడ్డి విమర్శించారు.
బిజెపి పాలిత ప్రాంతాలలో తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్టు ఆయా రాష్ట్రాలలో ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలు ఏమైనా అమలు చేస్తున్నారా అని ప్రశ్నించారు.
హైదరాబాద్ బీజాపూర్ హైవే 2022లో మే లో టెండర్ ఫైనల్ అయి హైవే 60 మీటర్స్ వెడల్పుతో సెప్టెంబర్ 28 పైనల్ అయినదన్నారు.హైవే భూసేకరణ పనులు 77శాతం పూర్తయింది అన్నారు.

ALSO READ: ప్రజల మధ్యన విభజన చిచ్చుకు బిజెపి కుట్ర

మొత్తం కేంద్రం హైవేకి ఇచ్చింది 39 వేల కోట్లు ఇస్తే చెప్పే లెక్కే మాత్రం వేరే అని అన్నారు. ముస్లిం రిజర్వేషన్ పెంపు బిల్లు కేంద్రంకు పంపిన పెడచెవిన పెట్టారన్నారు. అన్నదమ్ముల కలిసి ఉన్న రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చు పెట్టుడమే బిజెపి పని అయిపోయిందన్నారు.

పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా పై ఎందుకు స్పందించలేదు అని అడిగారు.కేంద్రం నుంచి చేవెళ్ల కు వచ్చి ఏం హామీ ఇచ్చారని వారు ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారం బాధ్యులను అరెస్టు చేసి శిక్షిస్తామని చెబుతున్న ప్రభుత్వాన్ని రద్దు చేయమనడం అనైతికమని అన్నారు.13సార్లు గుజరాత్ పేపర్ లీక్ అయితే ప్రభుత్వాన్ని ఎందుకు రద్దు చేయలేరని ప్రశ్నించారు.

తెలంగాణ రాష్ట్రంలో కమాండ్ కంట్రోల్ రూమ్ చూస్తే లా అండ్ ఆర్డర్ ఏలా పని చేస్తుందో తెలుస్తుందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపాయి ఇవ్వలేదన్నారు.రాష్ట్రములో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.

ALSO READ: ప్రజల మధ్యన విభజన చిచ్చుకు బిజెపి కుట్ర
రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు ఇవ్వకపోయినా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళుతున్న నేత మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. మరోసారి కెసిఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని హెచ్చరించారు.
ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ…బిజెపి సభ బండి సంజయ్ కోసంమె పెట్టారన్నారు. రాష్ట్రంపై బీజేపీ విషయం కక్కుతున్నరన్నారు.దేశంలోనే శాంతి భద్రతలలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ అన్నారు.

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కేంద్రం పైసా ఇవ్వకపోయినా 79 శాతం పూర్తి అయినదన్నారు.మాజీ మంత్రి వికారాబాద్ ఎమ్మెల్యే చంద్రశేఖర్ కెసిఆర్ అన్నం పెడితే సున్నం పెట్టారన్నారు.

విదేశాలలో ఉన్న కొండ విశ్వేశ్వర్ రెడ్డికు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా సిగ్గుచేటు అని అన్నారు.
ఎమ్మెల్యేలు ఆనంద్,మహేష్ రెడ్డి మాట్లాడుతూ.. కొత్త సీసాలో పాత సారా లేక బిజెపి విద్వేషపూరితంగానే మాట్లాడుతుందని అన్నారు.

సభ ద్వారా తెలంగాణ ప్రజలకు చేవెళ్ల చేవెళ్ల పార్లమెంట్ ప్రజలకు ఏమీ హామీ ఇచ్చారని ప్రశ్నించారు. రాష్ట్రంలో మరోసారి బిఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని ఓర్వలేక రాష్ట్రంపై విషం చిమ్ముతున్నారని అన్నారు.

మతాల మధ్య చిచ్చుపెట్టే బిజెపి పార్టీని నమ్మేస్థితిలో తెలంగాణ ప్రజలు లేరని మరోసారి రాష్ట్రానికి సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మి రమణారెడ్డి,జడ్పిటిసి మర్పల్లి మాలతి కృష్ణారెడ్డి, మండల అధ్యక్షుడు పెద్దోళ్ల ప్రభాకర్, శెరి శివారెడ్డి,రవీందర్ రెడ్డి,,నరేందర్,నర్సింలు,ఫాయాజిద్దిన్,రాఘవేందర్,శేఖర్,వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు మండల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.