Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ప్రజల మధ్యన విభజన చిచ్చుకు బిజెపి కుట్ర

-మెజారిటీ ప్రజలను రెచ్చగొట్టేది రాజకీయ ప్రయోజనాల కొరకే

-దేశ సంపదను కొల్లగొట్టి వారికి దోచి పెడుతన్నారు..

-దేశానికి గొప్ప చైతన్యాన్ని అందించిన సాయుధ తెలంగాణ పోరాట గడ్డ..

-మేధావులు,కవులు కళాకారులు,విద్యార్ది యువత ఆలోచన చెయ్యాలి..

మంత్రి జగదీష్ రెడ్డి..

భువనగిరి ఇంఛార్జి ఏప్రిల్ 24(నిజం న్యూస్)
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ విప్, ఆలేరు నియోజకవర్గం ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, శాసన సభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డి, గాధరి కిశోర్ లతో కలసి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఉత్పత్తుల భువనన్ని వారి చేతుల మీదుగా ప్రారంభించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.. ప్రజల మధ్యన విద్వెషాలు రెచ్చగొట్టి ప్రజలను విభజించే కుట్రలకు బిజేపి తెర లేపిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు.

ALSO READ: ఏజెంట్ ప్రీ-రిలీజ్ ఈవెంట్…. ముఖ్య అతిథిగా నాగార్జున

మెజారిటీ ప్రజలను రెచ్చగొట్టేది బిజెపి రాజకీయ ప్రయోజనాల కొరకే నని ఆయన మండిపడ్డారు. మధ్యాయుగం నాటి సంస్కృతిని తెరమీదకు తెచ్చేందుకు మోడీ, అమిత్ షాలు దేశ ప్రజలను పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తుందన్నారు.

మేధావులు, కవులు, కళాకారులు, విద్యార్థి యువత అప్రమత్తంగా ఉండాలని ఆయన ఉద్బోధించారు. పెట్టుబడి దారుల చేతిలో మోడీ, అమిత్ షాలు కీలు బొమ్మల్లా మారారని ఆయన దుయ్యబట్టారు.

దేశ సంపదను కొల్లగొట్టి పెట్టుబడి దారులకు అప్పనంగా అప్పగిస్తున్నారని ఆయన విరుచుకుపడ్డారు. తెలంగాణా ప్రజలుకు మా ప్రభుత్వం పట్ల విజ్ఞాత ఉంది. మీ ఆటలు ఇక్కడ సాగవన్నారు.

దేశానికి గొప్ప చైతన్యం కలిగించిన తెలంగాణా సాయుధ రైతాంగా పోరాటం జరిగింది. ఈ గడ్డ మీదనే అని ఆయన గుర్తుచేశారు.

రైతాంగమే ఆయుధాలు ధరించి చేసిన పోరు మా తెలంగాణ ప్రజలది. బిజెపి పార్టీ దుర్మార్గాలకు పులిస్టాఫ్ పెట్టకపోతే అటువంటి పోరాటం పునరావృతం అవుతుందని మంత్రి జగదీష్ రెడ్డి హెచ్చరించారు.