విరూపాక్ష 2 రోజుల బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్.. 28 కోట్లు
సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా నటించిన విరూపాక్ష సినిమా మొదటి రోజు 12 కోట్లు, 2వ రోజు 16 కోట్లు వసూలు చేసింది.
బాక్సాఫీస్ వద్ద ఈ వారం బ్లాక్ బస్టర్ చిత్రంగా విరూపాక్ష నిలిచింది. సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం అత్యంత థ్రిల్లింగ్ అనుభూతిని అందించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది.
విరూపాక్ష మొదటి రోజు 12 కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే. 2వ రోజు విరూపాక్ష వసూలు 16 కోట్లు అని చెప్పారు . విరూపాక్ష 2 రోజుల మొత్తం బాక్స్ ఆఫీస్ గ్రాస్ కలెక్షన్స్ 28 కోట్లు, 2వ రోజు మొదటి రోజుతో పోలిస్తే 33 శాతం పెరిగింది.
ALSO READ: నాగ చైతన్య ‘కస్టడీ’ నుండి ‘టైమ్‌లెస్ లవ్’ వీడియో సాంగ్ విడుదల
యుఎస్ బాక్సాఫీస్ హాఫ్ మిలియన్ మార్కును దాటి, 1 మిలియన్ యుఎస్ డాలర్ల మైలురాయి వైపు పరుగెత్తుతోంది. యూఎస్ బాక్సాఫీస్ వద్ద సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
ఈ పెరుగుతున్న బాక్సాఫీస్ గణాంకాలతో విరూపాక్ష ఒక వారం లోపే తన బ్రేక్ ఈవెన్ మార్కును సులభంగా అధిగమిస్తుందని బాక్సాఫీస్ విశ్లేషకులు అంటున్నారు. అలాగే విరూపాక్ష కూడా అతి త్వరలో 50 కోట్ల మార్క్ ని క్రాస్ చేసే ఛాన్స్ ఉంది.
విరూపాక్ష సాంకేతికంగా మంచి చిత్రం, క్రెడిట్ మొత్తం దర్శకుడు కార్తీక్ దండుకే చెందుతుంది. కార్తీక్ సాంకేతిక బలాన్ని అత్యుత్తమంగా అందించినందుకు నిర్మాణ సంస్థ SVCCకి అభినందనలు తెలిపాడు .