పంట నష్ట పోయిన రైతులను ఆదుకుంటాం… మంత్రి కొప్పుల ఈశ్వర్
జగిత్యాలలో అకాల వర్షాలకు దెబ్బ తిన్న పంటలను పరిశీలించిన మంత్రి
జగిత్యాల, ఏప్రిల్ 23 (నిజం న్యూస్).
జగిత్యాల: జిల్లాలో అకాల వర్షాలకు పంటలు దెబ్బతిని పంట నష్ట పోయిన రైతులను ఆదుకుంటామని సంక్షేమ శాక మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు, వడగళ్ల వానలు, ఈదురు గాలులతో దెబ్బతిన్న పంటలను మంత్రి పరిశీలించారు.
జగిత్యాల రూరల్ మండల లక్ష్మీపూర్ గ్రామంలో దెబ్బతిన్న మామిడి, నువ్వు పంటలను జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ లతో కలిసి పరిశీలించారు.
ALSO READ: రిజర్వాయర్ సమీపంలో ప్లాట్ల ఏర్పాటుకు అనుమతులు ఎలా..?
ఈ సందర్భంగా మంత్రి దెబ్బతిన్న పంటలను పరిశీలించి, నష్టపరిహారాన్ని అందించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారిని ఫోన్ లో కోరారు.
అలాగే జిల్లా వ్యవసాయ శాఖ ఆదికారులు రైతులకు ఇబ్బంది లేకుండా నష్ట పరిహార నివేదిక ప్రభుత్వానికి పంపి,వారిని ఆదుకోనే ప్రయత్నం చేయాలని ఆదేశించారు.
మంత్రి వెంట సర్పంచ్ చెరుకు జాన్, ఆత్మ చైర్మెన్ రాజిరెడ్డి, గ్రామశాక అద్యక్షుడు సత్తిరెడ్డీ, లక్ష్మణ్, స్థానిక నేతలు,రైతులు,ఉన్నారు.