ఉనికి కోల్పోతున్న విశ్వకర్మ పంచ వృత్తిదారులు
ఎల్ బి నగర్,ఏప్రిల్ 22,నిజం న్యూస్.జగత్ గురు ఆదిశంకర చార్య,విశ్వ కర్మ భగవాన్,పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములవారి వారసులుగా పరిగణించబడే విశ్వకర్మ పంచదాయిలు తమ ఉనికి కోల్పోతున్నారనీ అంటే అవుననే చెప్పాలి.ఒకప్పుడు ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ జాతి భవిష్యత్ లో కనుమరుగు అయ్యే అవకాశం ఉంది.
వ్యవసాయానికి అవసరమైన పనిముట్లు ఈ జాతి లోని వడ్ల,కమ్మరి వాళ్ళు తయారు చేసేది. కాల జ్ఞానీ వీరబ్రహ్మం గారు వడ్రంగి వృత్తి పని చేసుకుంటూనే కాలజ్ఞానం రచించిన మహానుభావుడు. ముస్లిం వ్యక్తి,సిద్దయ్య,దళిత వ్యక్తి కక్కయ్య ను తన వద్ద శిష్యులు గా చేర్చుకుని వడ్రంగి వృత్తి పని నేర్పించాడు.
అలా ఈ వృత్తి పని అందరు నేర్చుకున్నారు.ఈ వృత్తి నీ ప్రభుత్వం ఐ టి ఐ లో కూడా చేర్చింది. కానీ కాలక్రమేణా వీళ్ల మనుగడ ప్రశ్నార్ధకం అయ్యింది.కమ్మరి పని కాస్తా ఇంజనీరింగ్ వర్కు అయ్యింది. కర్ర పని స్థానం లో డబ్ల్యు.పి.వి.సి.యూ పి వి సి కంపెనీలు వచ్చాయి.ఇంకా కొత్తగా గత 4 ఏళ్ల క్రితం టర్కీ పరిజ్ఞానం తో ఎన్ సి ఎల్ కంపెనీ డోర్స్ విభాగం ప్రారంభించింది.వినియోగ దారుల ను ఆకర్షించే విధంగా ఆ కంపెనీ తమ ఉత్పతులను తయారు చేస్తుంది.ఈ కంపెనీ కలప రహిత ఉత్పత్తి తయారు చేస్తుంది.
ALSO READ: పీఎం సీటు కోసం కలగనకు కేసిఆర్
గ్రామాల్లో పనులు లేక చాలా మంది హైదరాబాద్ వలస వచ్చి కూలి పనులకు వెళ్తూ జీవిస్తున్నారు.బంగారం పని కూడా ఆదరణ తగ్గింది.పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీ లు ఈ రంగం లో కి అడుగు పెట్టినాయి. కంచరీ పని నీ కూడా కంపెనీలు హస్త గతం చేసుకున్నాయి.వాల్ల దగ్గర హోల్ సేల్ గా తెచ్చుకుని గ్రామాల్లో అమ్ముకుంటున్నారు.
ఈ స్టీల్ బిజినెస్ లోకి మార్వాడీ లు వచ్చారు.శిల్పుల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. వీళ్ల ను రాజకీయ పార్టీ లు ఓట్ బ్యాంక్ గా మాత్రమే చూస్తున్నాయి కానీ వీళ్ల సంక్షేమం కోసం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల అధిక శాతం మంది పేదరికం లోనే మగ్గుతున్నారు.ఈ జాతి లోని కొందరు తమ సొంత లాభం కోసం వీళ్ళను వాడుకుంటున్నారు కానీ వీళ్లకు ఒరిగేది ఎం లేదు.
ఉమ్మడి రాష్టం లో ఆదరణ పథకం కింద చంద్ర బాబు కొంత వరకు అధుకున్నరు కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా పట్టించుకున్న పాపాన పోలేదు.ఒక్క తెలంగాణ రాష్ట్రం లోనే దాదాపు 30 లక్షల మంది ఉన్నారు.అన్ని పార్టీ ల్లో పేరు పొందిన నాయకులు ఈ జాతి నుండి ఉన్నారు అయినా కూడా వీళ్లకు ఎటువంటి మేలు జరగడం లేదు.
వీళ్లలో ఐక్యత లేకపోవడం కూడా ప్రధాన కారణం.ఈ మధ్య నరేంద్ర మోడీ విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ అనే ఒక పథకాన్ని ప్రవేశ పెట్టి 54 వేల కోట్ల రూపాయలు ప్రకటించారు.ఇది ఎంత మేరకు అమలు అవుతుంది అనేది వేచి చూడాలి .ఇక తెలంగాణ రావడం కోసం శ్రీకాంత్ చారి తో మరో 40 మంది విశ్వకర్మ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి కి సిద్ధాంత కర్త గా ఉండి దిశా ,నిర్దేశం చేసిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్,బహుజన పోరాట వీరుడు మారోజ్ వీరన్న ఈ జాతి బిడ్డ నే .ఇంత గొప్ప ఘన కీర్తి ప్రతిష్టలు ఉన్న ఈ జాతి నీ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించకపోవడం శోచనియం.ఈ జాతి నీ అన్ని రాజకీయ పార్టీ లు ఓట్ బ్యాంక్ గానే చూస్తున్నాయి తప్ప వీళ్ల సంక్షేమం కోసం ఎటువంటి చర్యలు లేవు