Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

పీఎం సీటు కోసం కలగనకు కేసిఆర్

-బిజెపి అధికారంలోకి వస్తే ముస్లింల రిజర్వేషన్లు తొలగిస్తాం.

-కారు స్టీరింగ్ మజ్లిస్ చేతిలో.

-పేపర్ లీకేజీలపై ప్రశ్నిస్తే జైలుకు పంపడం దారుణం.

-రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుంది.

-ఎంఐఎంకు భయపడే పార్టీ బిజెపి కాదు.

-మోడీ మోడీ నినాదాలతో మారుమోగిపోయిన సభ ప్రాంగణం.

-భారీగా తరలివచ్చిన బిజెపి శ్రేణులు.

-చేవెళ్లలో బిజెపి సభ సక్సెస్.

చేవెళ్ల ఏప్రిల్ 23(నిజం న్యూస్)
చేవెళ్ల నియోజకవర్గ కేంద్రంలో పార్లమెంటరీ ప్రవాస్ యోజన విజయ సంకల్ప బహిరంగ సభ నిర్వహించారు.చేవెళ్ల పార్లమెంట్ లో ఏడు నియోజకవర్గాల కేంద్రాల నుండి ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ భారీ బహిరంగ సభకు కేంద్ర హోం మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో నిరంకుశ నియంత పాలన నడుస్తుందని అన్నారు. తెలంగాణలో బీజేపీ సర్కార్‌ రావాలా వద్దా?.. అని మాట్లాడగా సభ ప్రాంగణానికి వచ్చిన ప్రజలంతా మోడీ మోడీ అనే నినాదంతో సభ ప్రాంగణం ప్రజలందరు ఢిల్లీలోని ప్రధాని మోదీ కి వినపడేలా ప్రజలు నినదించాలని అని అమిత్‌షా పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం 9 ఏళ్లుగా అవినీతి పాలన సాగిస్తోందని, అన్నారు. రాబోవు రోజులో తెలంగాణలో బీజేపీ సర్కార్‌ రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లీకేజీల పర్వం నడుస్తుందని పేపర్‌ లీకేజీపై ప్రశ్నిస్తే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ని అరెస్ట్‌ చేస్తారా? ఆయన ఏం తప్పు చేశారని అరెస్ట్‌ చేశారు? అని ప్రశ్నించారు.

అక్రమ అరెస్ట్‌లకు బీజేపీ నేతలు, కార్యకర్తలు భయపడరని స్పష్టం చేశారు. తెలంగాణలో యువతకు అన్యాయం జరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో ఏ పరీక్ష పెట్టినా పేపర్‌ లీక్‌ అవుతోందని,పేపర్‌ లీకేజీలపై ఇప్పటివరకు సీఎం కేసీఆర్‌ స్పందించలేదని తప్పుబట్టారు.పేపర్‌ లీక్‌ ఘటనలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ జరగడం లేదని విమర్శించారు.

రాష్ట్రంలో కేంద్ర పథకాలు ప్రజలకు చేరడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ ఇచ్చే నిధులు అన్ని రాష్ట్ర ప్రభుత్వ నిధులుగా చెప్పు కుంటున్నారని ఉద్యమ చేశారు.కేసీఆర్‌ ఎన్ని కుట్రలు చేసినా.. ప్రజలను మోదీ నుంచి దూరం చేయలేరని అమిత్‌షా తేల్చిచెప్పారు. ప్రజాధనాన్ని సీఎం కేసీఆర్‌ దుర్వినియోగం చేస్తున్నరని అన్నారు.

ALSO READ: మైహోం నిర్మాణాలపై పడిన పిడుగు

కేసీఆర్‌ ప్రధాని కావాలని ఎన్నో కలలు కంటున్నారు.కేసీఆర్‌.. ప్రధాని సీటు ఖాళీగా లేదని తెలుసుకోవాలి.వచ్చే ఎన్నికల్లో కూడా మోదీనే ప్రధాని.కేసీఆర్‌ ముందు సీఎం సీటు కాపాడుకోవాలనిసూచించారు. కారు స్టీరింగ్‌ మజ్లిస్‌ చేతిలో ఉంది. ఎంఐఎంకు భయపడే విమోచన దినోత్సవాన్ని జరపట్లేదు.ఓవైసీ ఎజెండానే కేసీఆర్‌ అమలు చేస్తున్నారు. కేసీఆర్‌ అరాచక పాలనను ప్రజలు గమనిస్తున్నరని అన్నారు.

తెలంగాణ..ఎస్సీ,ఎస్టీ,ఓబీసీ వర్గాల ప్రజలది. రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లిం రిజర్వేషన్లను తొలగిస్తామని అన్నారు.ఎంఐఎంకు బీజేపీ భయపడదు అని అమిత్‌షా స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ ఇంచార్జ్ తరుణ్ చుంగ్,మధ్యప్రదేశ్ ఇన్చార్జ్ మురళీధరరావు,తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్, జాతీయ మహిళా అధ్యక్షురాలు గల్లా అరుణ,మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి,ఎమ్మెల్యే ఈటెల రాజేందర్,మాజీ మంత్రి ఏ చంద్రశేఖర రావు,జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు కాసర్ల వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి, తూళ్ల వీరేందర్ గౌడ్ చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గాల నాయకులు, చేవెళ్ల మండల శాఖ బిజెపి నాయకులు,పాండురంగారెడ్డి, అత్తిలి అనంతరెడ్డి,కేశపల్లి వెంకట రామ్ రెడ్డి,కృష్ణ గౌడ్, పత్తి సత్యనారాయణ,శ్రీనివాస్ యాదవ్,సందీప్ గౌడ్,
కార్యకర్తలు పాల్గొన్నారు.