Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

గూడెంలో గిరిజనుల మనుగడే ప్రశ్నార్థకం..!

-యువ గిరిజన నాయకుడే టార్గెట్గా సిండికేట్ మాఫియా తయార్.

-అక్రమాలను ప్రశ్నించినందుకే యువ నాయకుడి గొంతు నొక్కే ప్రయత్నం..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏప్రిల్ 23 (నిజం న్యూస్)

గత కొంతకాలంగా గిరిజనుల పైన జరుగుతున్న దాడులు అదేవిధంగా గిరిజన చట్టాలను ఉపయోగించుకొని కొంతమంది అక్రమ వ్యాపారాలు అక్రమ దందాలు నిర్వహిస్తూ కోట్లకు పరిగెత్తుతున్నారు.

ఇదే కోణంలో అక్కడక్కడ అమాయక గిరిజనులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం ఏర్పడినప్పటి నుంచి గిరిజనుల మనుగడ ప్రశ్నార్ధకంగా మారిందా?అంటే మేధావులు అవుననే చర్చిస్తున్నారు.

కొత్తగూడెం నియోజకవర్గంలో నాలుగు గిరిజన మండలాలు ఉన్నప్పటికీ మెజార్టీ ఓట్లు గిరిజనులవే అయినప్పటికీ ప్రధానంగా ఏజెన్సీ చట్టాలైనటువంటి 1/70 యాక్ట్,పిసా లాంటి కఠిన చట్టాలు ఉన్నప్పటికీ కొంతమంది అక్రమ వ్యాపారులు ఈ చట్టాలను ప్రజా ప్రతినిధులు,అదేవిధంగా ప్రభుత్వ అధికారుల సహకారంతో చుట్టాలుగా మార్చుకొని దందాలకు పాల్పడుతున్నారని ప్రధాన ఆరోపణలు వున్నాయి.

Also read: తెలంగాణపై విషం చిమ్మడానికే అమిత్ షా రాక

ఒకప్పుడు ఓనర్లుగా స్వేచ్ఛగా జీవించినటువంటి గిరిజనులను డెవలప్మెంట్ పేరుతో మభ్యపెడుతూ అక్కడక్కడ బానిసలుగా కూలీలుగా మారుస్తున్నారని ప్రజలు భావిస్తున్నారు.వీటి పైన ప్రశ్నించే నాధుడే కరువయ్యారని గిరిజన జాతులు వాపోతున్నాయి.

మరో పక్క గిరిజన చట్టాలకు వ్యతిరేకంగా అక్రమ వ్యాపారాలు,దందాలు నిర్వహిస్తూ అమాయక గిరిజనులను ఆర్థిక ప్రలోభాలకు గురిచేసి వారిని తీవ్రంగా మోసం చేస్తున్నారు.ఇదేంటని ప్రశ్నిస్తే భౌతిక దాడులు,అక్రమ కేసులు బనాయిస్తూ ఇబ్బందులు గురిచేస్తున్నారని గిరిజనుల సమస్యలపై వారి పక్షాన నిలబడే నాయకుడికి రాజకీయ పార్టీల సహకారం లేకపోవడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని ప్రజలు భావిస్తున్నారు.

ఈ మధ్యకాలంలో గిరిజనుల చట్టాలను పరిరక్షిస్తూ వారి యొక్క హక్కులపై అవగాహన కల్పిస్తూ ,జాతులను ఏకం చేసే ప్రయత్నం చేసి వారి యొక్క అభివృద్ధి సంక్షేమ ఫలాల పై బలమైన గొంతుతో ఉన్నత చదువులు చదివి గిరిజనుల సమస్యలపై నిత్యం స్పందిస్తూ వారికి అండగా నిలబడినటువంటి యువ నాయకుడిని ఆదిలోనే అనగదొక్కాలని ఏజెన్సీ ప్రాంతంలో అక్రమ దందాలు నిర్వహించే వ్యక్తులంతా సిండికేట్ గా ఏర్పడి గిరిజన నాయకుడికి నిత్యం బ్రేకులు వేస్తూ అనేక రకాలుగా ఇబ్బందులకి గురి చేస్తున్నారని గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి.

మరోపక్క నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి గిరిజన ప్రజలు కార్యకర్తలుగా కొన్ని వేల సంవత్సరాలుగా జెండాలు మోస్తున్నారు కానీ నేటికీ ఏ ఒక్క గిరిజన నాయకుడిని ఎదగనీయకుండా రాజకీయ పార్టీలు అక్రమ వ్యాపారుల సూచన మేరకు గిరిజన నాయకులను అణచివేస్తున్నారని ప్రధాన ఆరోపణలు ఉన్నాయి.

ఇప్పటికైనా గిరిజన నాయకులు,పలురాజకీయ పార్టీలు మేల్కొని గిరిజన చట్టాలను,గిరిజనుల మనుగడలను కాపాడాల్సిందిగా పలువురు కోరుతున్నారు.