డాక్టర్ల నిర్లక్ష్యం… తల్లి, బిడ్డ లు …
జిల్లా కేంద్రమైన సంగారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్లో కలకలం
సంగారెడ్డి ఎప్రిల్ 22 ( నిజం న్యూస్ )
తల్లీ, శిశువు మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎంసీహెచ్లో చోటు చేసుకుంది. సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి మొదటి కాన్పు కోసం ఈ నెల 20వ తేదీన సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం కిషన్ నాయక్ తండ వాసర్కు చెందిన రాథోడ్ రేణుక పురిటి నొప్పులు భరించకపోవడంతో సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎంసీహెచ్లో చేర్పించారు.
కాగా ఈ నెల 21న నొప్పులు ఎక్కువగా వస్తున్నాయి, ఆపరేషన్ చేసి డెలివరీ చేయమని రేణుక కుటుంబ సభ్యులు డాక్టర్లకు తెలిపినట్టు రేణుక కుటుంబ సభ్యులు అంటున్నారు.
ALSO READ: అకాల వర్షంతో అష్ట కష్టాలు
డాక్టర్లు మాత్రం రేణుకకు నార్మల్ డెలివరీ చేసస్తామని ఆపరేషన్ చేయమన్నారని కుటుంబ సభ్యులకు తెలిపారు.
కాగా డాక్టర్ లు డెలివరీ సమయంలో రేణుకకు బీపీ, పిట్స్ వచ్చాయని, డెలివరీ చేసే క్రమంలో రేణుక మగ బిడ్డకు జన్మనిచ్చింది. జన్మించిన మగ బిడ్డ మృతి చెందాడని డాక్టర్లు నిర్ధారించారు.
రేణుక పరిస్థితి విషమించడంతో ఐసీయూలో చేర్పించారు. చికిత్స చేస్తుండగా రేణుక శనివారం ఉదయం 11:30 గంటల సమయంలో మృతి చెందిందని డాక్టర్లు తెలిపారు. గర్భిణీ రేణుక డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. రేణుక మృతికికారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని రేణుక కుటుంబ సభ్యులు సంగారెడ్డి సిఐకి వినతి పత్రం అందజేశారు.