Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

విద్యుత్ షాక్‌ ….బెటాలియన్ కానిస్టేబుల్ …

విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కానిస్టేబుల్ మృతి

విద్యుత్ షాక్ తో కానిస్టేబుల్ మృతి

ములుగు జిల్లా ప్ర‌తినిది, ఏప్రీల్, 22 నిజం న్యూస్‌:- ప్ర‌మాద‌వ శాత్తు విద్యుత్ ఘాతంతో కానిస్టేబుల్ మృతి చెందిన సంఘటన ములుగు జిల్లా వాజేడు మండలం శ్రీ‌రాంన‌గ‌ర్ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది.

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వాజేడు మండలం చెరుకూరు పంచాయతీ శ్రీరాంనగర్ గ్రామానికి చెందిన తాటి మహేందర్ (29) చత్తీస్గడ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లా, సోంపూర్ లో ఐటిబిపి 53 బెటాలియన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నడు ఈ నెల సెలవుల నిమిత్తం తన ఇంటికి వచ్చాడు.

ALSO READ: అకాల వర్షాలు, ఈదురు గాలులు …..రైతుల పంటలు నేలపాలు

త‌న‌ ఇంట్లోని కూలర్ రిపేర్ చేస్తుండగా కరెంట్ షాక్ కొట్టడంతో స్పృహ కోల్పోయిన తాటి మహేందర్ ను గమనించిన కుటుంబ సభ్యులు వాజేడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్ప‌టికే మహేందర్ ప‌రిస్థితి విష‌మించడంతో మెరుగైన వైద్యం కోసం ఏటూరు నాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మ‌హేంద‌ర్‌ను ప‌రిశీలించిన వైద్యులు అప్ప‌టికే తాటి మహేందర్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

తాటి మహేందర్ కు భార్య ప్రసన్న, మూడు నెలల బాబు, తండ్రి నారాయణ, తల్లి జయలక్ష్మి ఉన్నారు. తాట మహేందర్ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్వం అయ్యారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని వాజేడు ఎస్సై రేక అశోక్ తెలిపారు.