Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

నేడు గుజరాత్ టైటాన్స్‌తో…. లక్నో సూపర్ జెయింట్ ఢీ

లక్నో జట్టు శనివారం విజయంతో స్థానిక అభిమానులకు ఈద్ బహుమతిని ఇవ్వాలనుకుంటోంది.  లక్నోకి ఇక్కడ  మూడో మ్యాచ్‌.

ఐపీఎల్ 30వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో లక్నో సూపర్ జెయింట్ తలపడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్‌తో లక్నో జట్టు ఏకనా స్టేడియంలో ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోవాలనే కసితో ఉన్నారు .  గత మ్యాచ్‌లో రాజస్థాన్‌పై ఓడిన గుజరాత్ జట్టు మళ్లీ గెలుపుబాట పట్టాలని భావిస్తోంది.

గతేడాది సూపర్‌జెయింట్స్‌, టైటాన్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ విజయం సాధించగా, ఈ ఏడాది లక్నో జట్టు మెరుగైన ప్రదర్శన కనబరిచింది. ఓవరాల్‌గా లక్నోను స్వంత ప్రదేశం లో  ఓడించడం చాలా కష్టం.

గత ఏడాది ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన ఇరు జట్లు అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాయి. ముఖ్యంగా గత సీజన్‌లో గుజరాత్‌  టైటిల్‌ను కైవసం చేసుకుంది. అదే సమయంలో లక్నో జట్టు ప్లేఆఫ్‌కు చేరుకుంది.

లక్నో జట్టు లో  పెద్ద మార్పు  లేదు
ప్రస్తుత సీజన్‌లో లక్నో జట్టు సమతూక ప్రదర్శన ఇస్తుంది . బెంచ్‌లో ఉన్న క్వింటన్ డి కాక్‌కు ఈ సారి అవకాశం ఇవ్వవచ్చు, కైల్ మేయర్స్ , పూరన్ నుండి బాగా ఆడుతుండటం తో  అతనిని ప్లేయింగ్ XI లోకి చేసే అవకాశాలను తగ్గించాయి.  టీ20 స్పెషలిస్ట్ ప్లేయర్‌కు టీమ్ మేనేజ్‌మెంట్ అవకాశం ఇవ్వవచ్చు.  ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో విఫలమైన దీపక్ హుడాను తప్పించి డికాక్‌ను చేర్చుకోవచ్చు.

ALSO READ: గంగకు మనమే శాపం

 స్పినర్లకు  అనుకూలం …
లక్నోలోని ఎకానా స్టేడియం ఎప్పుడూ  స్పినర్లకు అనుకూలమైనది.  ఈ పిచ్ లో  రషీద్ ఖాన్ ప్రదర్శన అత్యద్భుతంగా ఉంది. ఈ రోజు  అతను గుజరాత్‌కు కీలకం  కావచ్చు.

చాంపియన్ గుజరాత్ కు ఆల్ రౌండర్లు  బలం. కెప్టెన్ హార్దిక్ నుంచి జట్టు భారీ ఇన్నింగ్స్‌ను ఆశించనుంది.  ఒడియన్ స్మిత్, రాహుల్ తెవాటియా, జయంత్ యాదవ్‌లు అద్భుతమైన ఆటను ప్రదర్శిస్తున్నారు.   శుభ్‌మన్ గిల్ ప్రతి సందర్భంలోనూ అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు . బౌలింగ్‌లో మహ్మద్ షమీ, శివమ్ మావి, అల్జారీ జోసెఫ్‌ల నుంచి మంచి ప్రదర్శన ఆశిస్తున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు బ్యాటింగ్‌లో రాణిస్తున్న విజయ్ శంకర్ ఫిట్‌గా లేడు. ఒకవేళ అతను ఫిట్‌గా ఉంటే అభినవ్ మనోహర్ స్థానంలో నేరుగా జట్టులో చోటు దక్కించుకుంటాడు.

ఇద్దరు సోదరుల మధ్య పోటీ…
ఇకనా స్టేడియంలో శనివారం ఇద్దరు సోదరుల మధ్య పోటీ జరగనుంది. అన్నయ్య కృనాల్ పాండ్యా లక్నో సూపర్‌జెయింట్స్‌కు కీలక ఆటగాడిగా ఎదుగుతుండగా, గుజరాత్ కెప్టెన్ హార్దిక్ కెప్టెన్ గా  పోటీపడనున్నాడు.

వాతావరణం….

వాతావరణం సాధారణంగా స్పష్టంగా ఉంటుంది. మధ్యలో మేఘాల వచ్చే అవకాశం ఉంది . మధ్యలో బలమైన గాలులు  కూడా వీస్తాయని చెపుతున్నారు . ఉష్ణోగ్రత దాదాపు 35 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.

ALSO READ: మహ్మద్ సిరాజ్ పర్పుల్, డు ప్లెసిస్ ఆరెంజ్ క్యాప్…

ప్లే -11
లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్, కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్ (WK), ఆయుష్ బడోని, నవీన్-ఉల్-హక్, అవేష్ ఖాన్, యుధ్వీర్ సింగ్ చరక్, రవి బిష్ణోయ్.

గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా (వికె), శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా (సి), విజయ్ శంకర్/అభినవ్ మనోహర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, మహమ్మద్ షమీ, మోహిత్ శర్మ.