భక్తులకు బాబా దివ్యదర్శనం
ఆకాశమంత బాబా !
అండ దండ నువ్వే బాబా !!
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా..ఏప్రిల్ 22.నిజం న్యూస్..
ఆధ్యాత్మికతకు నిలువెత్తు చిరునామా అయిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పుణ్యక్షేత్రాలకు పెట్టింది పేరు.ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాచీన దేవాలయలతో పాటు నూతనంగా నిర్మించిన ఆలయాలను దర్శించుకోవడానికి దేశవ్యాప్తంగా భక్తులు వేలసంఖ్యలో ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలకు తరలిరావడం నిరంతరం జరిగే ప్రక్రియ.
ఈ దేవాలయలలో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో భాగం,ప్రస్తుత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రసిద్ధ శైవ పుణ్యక్షేత్రం,దక్షిణ కాశీగా పిలవబడే ద్రాక్షారామ కు కొంచెం దూరంలో ఉన్నటువంటి,కోటిపల్లి కాకినాడ రహదారి మార్గంలో హాసన్ బాద గ్రామం సమీపంలోగల కన్నడతోట వద్ద గల నిలువెత్తు 60 అడుగుల సాయిబాబా విగ్రహం భక్తులను విశేషంగా భక్తి పారవశ్యంలో మునిగేలా చేసి,చూపరులను ఆకట్టుకుంటుంది.
ALSO READ: పరమపవిత్రం కాశీ క్షేత్రం
బాబా కొలువై ఉన్న పీఠం ఎత్తు సుమారు 70 అడుగులతో మొత్తం సుమారు 130 అడుగుల నిండయిన వదనంతో బాబా భక్తులకు కొండంత అభయం ఇస్తున్న అనుభూతి కలుగుతుంది. ప్రతీ రోజు ఇక్కడకు భక్తులు అధికసంఖ్యలో వచ్చి బాబా దర్శనం చేసుకుంటున్నారు.
ఈ సంఖ్య గురువారం రోజు లెక్కకు మిక్కిలిగా ఉంటుందని ఆలయ నిర్వాహకులు అంటున్నారు.ఈ 130 అడుగుల నిండయిన బాబా విగ్రహం పచ్చని చేల మధ్యలో ఉండి పైన ఉన్న నీలాకాశం గొడుగు మాదిరిగా కనపడుతు దూరం నుండి సైతం నిండయిన దర్శనం ఇస్తున్నట్లు కనిపిస్తూ బాబా భక్తులకు దివ్యదర్శనం కలుగజేస్తుంది.