నేలకొరిగిన గజస్తంభం
-గాలిలొ ఎగిరిన పాలీహౌస్
చేవెళ్ల ఏప్రిల్ 21(నిజం న్యూస్):
చేవెళ్ల మండలం చన్వల్లి గ్రామంలో హనుమాన్ ఆలయంలో గజస్తంభం నేలకొరిగింది. ప్రకృతి వైపరీత్యం వల్ల ఈ ఘటన జరిగింది.
శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో ఉరుములు మెరుపులు బీభత్సవమైన గాలి వీచడంతో హనుమాన్ ఆలయంలో ఉన్న గజ స్థంభం నేలకొరిగి తునాతునకలైనది.
పకృతిలో సంభవించిన ఈ వైపరీత్యం వల్ల రైతులు ఏర్పాటు చేసుకున్న పాలీహౌస్ (పూల షెడ్లు) పాతిన పైపులతో సహా గాలిలో ఎగిరిపోయాయి. దాదాపుగా 12 పాళీ హౌసులు ధ్వంసం అయినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.
ALSO READ: గోవిందుడికి కాసుల పంట గా విద్యానగర్ కాలనీ పంచాయితీ
రైతు ఒక్క పాలి హౌస్ నిర్మించడానికి అయ్యే ఖర్చు 25 లక్షల వరకు అవుతుందన్నారు.హఠాత్తుగా సంబవించిన ప్రకృతిలో వైపరీత్యం వల్ల బీభత్సమైన గాలులు ఉరుములు మెరుపులు తో కూడిన ఈ ఘటన వల్ల గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ గడిపారు.
ఏది ఏమైనా పకృతి లో ఏర్పడ్డ ఈ వైపరీత్యం వల్ల గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడిపారు.
చన్వెల్లి గ్రామం పాలి హౌస్ లకు నిలయమై పేరుగాంచి గాంచింది. ఈ వైపరీత్యం వల్ల రైతులకు జరిగిన నష్టాన్ని అధికారులు అంచనా వేయాల్సి ఉంది.