Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

గోవిందుడికి కాసుల పంట గా విద్యానగర్ కాలనీ పంచాయితీ

-పట్టించుకోని అధికారులు,

-ఆగని అక్రమ కట్టడాలు

-సంబంధిత అధికారులకు లక్షల్లో ముడుపుల మాట నిజమేనా …

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏప్రిల్ 21 (నిజం న్యూస్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం లోని చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీ గ్రామ పంచాయతీ అక్కడ ప్రజాప్రతినిధులకు,సంబంధిత అధికారులకు కాసులు పంటగా మారింది.రోజు రోజుకి అక్రమంగా వెంచర్లు బహుళ అంతస్తు నిర్మాణాలను ఎటువంటి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి.

వీటన్నింటికీ సంబంధిత అధికారులు,రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు వెనుక ఉండి భారీగా ముడుపులు తీసుకొని అక్రమార్కులకు సహకరిస్తున్నట్టు పలు ఆరోపణలు ఉన్నాయి.

ముఖ్యంగా పంచాయతి అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన ఒక ప్రజా ప్రతినిధి తన ప్రభుత్వం ఉద్యోగాన్ని సైతం పక్కనపెట్టి అధిక మొత్తంలో ముడుపులు తీసుకుంటూ పంచాయతీలో అక్రమాలకు సహకరిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఉన్నతమైన స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ నెల నెల ప్రభుత్వ నుంచి వచ్చే జీతం తీసుకుంటూ అదే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వ ఖజానాని పెంచాల్సింది పోయి అక్రమమార్గంలో వెంచర్లకు, బహులంతస్తు నిర్మాణాలకు తనదైన శైలిలో భారీ ముడుపులు తీసుకొని పర్మిషన్ ఇస్తూ వారికి సహకరిస్తున్నట్టు పలు ఆరోపణలు ఉన్నాయి.

ALSO READ: బస్సులు రాని బస్టాండ్

సంబంధిత అధికారులకు పలుసార్లు చెప్పిన ఎవరు పట్టించుకోవడంతో అక్రమార్కులు రోజురోజుకి తన శైలిలో అందరిని బెదిరిస్తూ అక్రమాలపై కథనాలు రాయడానికి వెళ్లిన విలేకరులను సైతం బెదిరిస్తు,అక్రమాలపై,అక్రమ కట్టడాలపై కవరేజ్ కోసం వెళ్ళిన వాళ్ళను సైతం ఫోటోలు వీడియోలు తీస్తూ డబ్బుల కోసం వచ్చి బెదిరిస్తున్నారని వాటిని సోషల్ మీడియాలో పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి.

దివి పైన వున్న “గోవిందుడు” అయినా దక్షణ ఇవ్వకపోయినా భక్తులను ఆశీర్వదిస్తాడేమో కానీ విద్యానగర్ కాలనీలో ఉన్న “గోవిందుడు” మాత్రం తనకు ముడుపులు ఇవ్వనిదే ఏటువంటి వాటికి పర్మిషన్స్ ఇవ్వడని కాసులు ఉంటేనే విద్యానగర్ కాలనీ గోవిందుడు కనికరిస్తాడని పలువురు ఆరోపిస్తున్నారు.

విద్యానగర్ కాలనీలో ఉన్న అక్రమ కట్టాడాల పై రోజుకి ఏదో ఒక పత్రికలో ఒక కథనం వస్తున్నా కూడా కనీసం అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం,కనీస స్పందించక పోవడం పై సర్వత్ర విమర్శలు వెల్లివెత్తుతున్నాయి.ముఖ్యంగా విద్యానగర్ కాలనీలో బైపాస్ రోడ్ లో గల చాయ్ క్లబ్ వెనకాల ఉన్నత స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగం చేసిన ఒక మాజీ సింగరేణి ఉద్యోగి పంచాయతీ నుంచి ఎటువంటి అనుమతి లేకపోయినా ఒక బహులంతస్తు నిర్మిస్తుంటే అదే సింగరేణి సంస్థలో పనిచేసే విద్యానగర్ కాలనీ పంచాయితీ ప్రజా ప్రతినిధి దానికి వత్తాసు పలకడం అంతేకాకుండా దానిపైన ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఒక నిరుపేద ఒక చిన్న రూము వేసుకున్న వెంటనే స్పందించిబ్ దాన్ని కూలగొట్టే అధికారులు విద్యానగర్ కాలనీలో మాత్రం పదుల సంఖ్యలో అక్రమంగా బహులంతస్తు నిర్మాణాలు,ప్రభుత్వ భూమి నీ కబ్జా చేసి వెంచర్లు వేస్తుంటే స్పందించకపోవడం అంతేకాకుండా కనీసం ఏజెన్సీని పరిరక్షించాల్సిన సంఘాలు,నాయకులు అటువైపుగా కన్నెత్తి చూడడంలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దీనిపై విద్యానగర్ కాలనీ సెక్రటరీని వివరణ కోరక విద్యానాగర్ కాలనీ పంచాయతీలో జరుగుతున్న అక్రమ కట్టడాలకు ఎటువంటి అనుమతులు లేవని అటువంటి కట్టడాలపై కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పడం కోస మెరుపు.ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి వీటన్నిటికి సహకరిస్తున్న సర్పంచ్,ఇతర అధికారులపై కఠినమైన చర్యలు తీసు కోవాలని పలువురు కోరుకుంటున్నారు.