‘పుష్ప’కు టైమ్ కలిసొచ్చేనా?

 వెబ్‌డెస్క్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న సూపర్ ఎగ్జైటింగ్ మూవీ ‘పుష్ప’. సినిమా ప్రకటించిన కొద్దిరోజులకే లాక్‌డౌన్ స్టార్ట్ కావడంతో ఇప్పటికీ షూటింగ్ మొదలవ్వలేదు. లాక్‌డౌన్ సడలింపుల తర్వాత అయినా చిత్రీకరణ స్టార్ట్ అవుతుంది అనుకుంటే ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతూనే ఉంది.

శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో కథ ఉండనుండగా.. అందుకు అనుగుణంగా కేరళ ఫారెస్ట్‌లో షూటింగ్ ఏర్పాట్లు చేసుకున్నారు డైరెక్టర్ సుకుమార్. అత్యధిక శాతం అడవిలోనే సినిమా చిత్రీకరణ జరగాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆగిపోయిందని తెలుస్తోంది. దీంతో మూవీ యూనిట్ మరో స్పాట్ ఎంచుకుని, అనుమతులు తీసుకోవాల్సి ఉంది. దీంతో అన్ని సెట్ చేసుకుని డిసెంబర్ మొదటి వారంలో పుష్ప షూట్ స్టార్ట్ చేయాలని భావిస్తున్నారట సుకుమార్.