Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కార్పోరేట్లపై ఉన్న ప్రేమ రైతులపై ఏదీ

మనదేశంలో కార్పోరేట్‌ రంగాలకు ఇస్తున్న ప్రోత్సాహకాలు అన్నం పెడుతున్న రైతులకు ఇవ్వడం లేదు. వారిని బిచ్చగాళ్లుగా చూస్తూ చేతులు విదిలిస్తున్నాం. బహుళజాతి కంపెనీలకూ ఎర్రతివాచీలు పరుస్తున్న ప్రభుత్వాలు రైతులను అనుత్పాదక రంగాలుగా చూస్తున్న తీరు దారుణం కాక మరోటి కాదు.

కార్పోరేట్‌ కంపెనీల యాజమాన్యాలతో రాసుకు పూసుకు తిరుగుతున్న ప్రభుత్వాధినేతలు అందులో పైసవంతు విలువ రైతులు ఇవ్వడం లేదు.అన్నదాతల విషయంలో ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉండడంతో మనదేశంలో తిండి గింజలను అధికదరలకు పెట్టి కొనుక్కుంటున్నాం.

నిరంతరం శ్రమించినా వారికి అప్పులు మిగులుతున్నాయి. ఆస్తులు కరుగుతున్నా..కష్టాల నుంచి బయటపడడం లేదు. కార్పోరేట్లు చేస్తున్న దేమిటో.. వీరు చేయలేనిదేమిటో ప్రభుత్వాలు గుర్తించాలి.

స్వాతంత్య్రం లభించి ఏడు దశాబ్దాలు పూర్తయినా ఈ ఆధునిక ఆర్థిక వ్యవస్థలో రైతుల సమస్యలు మరింత జఠిలం అవుతున్నాయే తప్ప పరిష్కారం కావడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన వ్యవసాయిక విధానం లేకపోవడం రైతుల పాలిట శాపంగా మారిపోయింది.

ALSO READ: ఈదురు గాలులు , వర్ష బీభత్సము…రైతుకు…

ఫ్రీ మార్కెట్‌ అనేది ఒక అభూత కల్పన మాత్రమే అయ్యింది. రైతులను ఓటు బ్యాంకుగా చూడడం అలవాటు చేసుకున్న పాలకులు వారిని దేశ ఆర్థికరంగంలో కీలకమైన వ్యక్తులుగా చూడడం లేదు. నిజానికి కంపెనీలకు మించిన ఆదాయాన్ని, ఉద్యోగ కల్పనను వ్యవసాయ రంగమే కల్పిస్తోంది.

వ్యవసాయానికి పెద్దపీట వేసివుంటే ఈ రంగం దేశ ఆర్థిక పురోగతిలో కీలకం కానుంది. నిజానికి దేశ ఆర్థిక చోదక శక్తిగా రైతులు ఉంటున్నారు. అన్నదాతలు వ్యవసాయం బంద్‌ చేస్తే కార్పోరేట్‌ కంపెనీలు కూడా మూతపడాల్సిందే. అలాటి వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతున్నా రైతుల ఆర్థిక వ్యవస్థ మాత్రం బాగుపడడం లేదు. అవసరం లేకున్నా ఇబ్బడిముబ్బడిగా ఆహారధాన్యాలను దిగుమతి చేసు కోవడం కూడా రైతులకు శాపంగా మారింది.

కల్తీలు కూడా రైతును కాటేస్తున్నాయి. మన అసవరాలకు సరిపడా వరి, గోధుమలు, జొన్న, మక్కజొన్న ,కందులు, మిరప, మినుములు, పెసర వంటి అనేక పంటల ను రైతులు చెమటోడ్చి పండిరచినా వాటిని కొనుగోలు చేయడం లేదు.ఇతర దేశాలనుంచి ఆహార ధాన్యాల దిగుబడి తక్షణం ఆపడంతో పాటు..మన రైతును అవసరమైన పంటలు పండిరచేలా ప్రోత్సహించాలి.

అప్పుడు మన అసవరాలకు అనగుణంగా పంటల విధానం వస్తుంది. పంటల విధానంలో మార్పులు రావాలని వ్యవసాయ నిపుణులు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. వ్యవసాయరంగాన్ని ప్రోత్సహించి, అనుబంధ రంగాలను అభివృద్ది చేస్తే దేశానికి, ప్రపంచానికి అన్నం పెట్టే స్థోమత మన అన్నదాతలకు ఉంది.

ALSO READ: రాష్టాల్ర ఖజానాను దెబ్బతీస్తున్న ఉచితాలు

అనేక ఛోటామోటా కంపెనీలకు ఇస్తున్న రాయితీల మాదిరి వ్యవసాయానికి కూడా రాయితీలు ఇచ్చి పంటల ఉత్పత్తిని సవాల్‌గా తీసుకోవాలి.. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు పెట్టి యువతను ప్రోత్సహించడం ద్వారా నిరుద్యోగ సమస్యకు, పంటల కొనుగోళ్ల సమస్యలకు చెక్‌ పెట్టవచ్చు. కానీ అలా జరగడం లేదు.

సస్య విప్లవానికి నాంది పలికేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలకు పూనుకో వాల్సిన తరుణంలో వారి జీవితా లతో చెలగాటమాడుతున్నారు. దేశీయంగా వ్యవసాయ పురోభివృద్దికి పాటుపడడం లేదని వ్యవసాయరంగ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. అలా చేయడం వల్ల వ్యవసాయరంగం అతిపెద్ద ఉత్పాదక రంగంగా మారగలదని చెబుతున్నారు.

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు పెంచితే మంచిది. అయితే ధాన్యం కొనుగోళ్ల వ్యవహారన్ని పక్కన పెట్టిన పాలకులు దీనిపై రాజకీయం చేస్తున్నారు. ధాన్యం విషయంలో అవసరమైతే రైతులను చైతన్యం చేయాలి. ఏ పంటలు వేయాలో తెలియ చేయాలి. పండిన పంటలను కొరుగోలు చేయడం..వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చే యంత్రాంగం అసవరం.

కానీ అందుకు భిన్నంగా రాజకీయ చేయడం వల్ల నష్టపోయేది ప్రజలే అని గ్రహించాలి. పోటాపోటీ ధర్నాలు,ర్యాలీలు, విమర్శలతో రాజకీయ లబ్ది పొందగలమేమో కానీ రైతుల సమస్యలను మాత్రం పరిష్కారం కావు. నిజానికి ధాన్యం కొనుగోలు అన్నది ఒక పంటకు ముందే నిర్ణయించాలి. ఏ పంట వేయాలో ముందే చెప్పాలి. కానీ అదేవిూ చేయకుండా రాష్ట్రప్రభుత్వాఉ కేంద్రంపైనా..కేంద్రం రాష్టాల్రపైనా నిందలు వేసి తప్పించుకోవడం సరికాదు.

ఇది ప్రభుత్వం.. పార్టీల మధ్య పోరాటం కాదని గుర్తించడం లేదు. ఇది ప్రభుత్వాల మధ్య యుద్ధం మాత్రమే కాగలదు. రైతు పండిరచిన పంట కల్లాలు, మార్కెట్‌ యార్డ్‌లు, చివరకు రోడ్లపై కూడా ఎక్కడ పడితే అక్కడ దర్శనమిస్తుంది.. కానీ, గిట్టుబాటు ధర చెల్లించి రైతు నుంచి పంటను కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వాలు పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్న తీరు దారుణం కాక మరోటి కాదు.

వడ్లు పండిరచాలని ఒకరు, పండిరచవద్దని మరొకరు.. ఇలా రైతులను గందరగోళంలోకి నెట్టేస్తున్నారు.. పంట దిగుబడులు పెరగడం ఒక కారణం అయితే.. ఆ స్థాయిలో కొనుగోళ్లు జరగకపోవడమే సమస్యకు అసలు కారణంగా మారింది. దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురియడంతో..సాగు విస్తీర్ణం పెరగడం, పుష్కలంగా పంట పడుతోంది.. ఇక, వరి పెద్ద మొత్తంలో సాగు చేస్తున్నారు..

సాధారణంగా వడ్లను కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఎఫ్‌సిఐ కొనుగోలు చేస్తూ వస్తుంది. వరి పండే రాష్టాల్ర నుంచి వాటిని కొనుగోలు చేసి అవసరం ఉన్న రాష్టాల్రకు సరఫరా చేయడం వారి బాధ్యత..ఇకపోతే విదేశాల నుంచి నూనెల దిగుమతి వేరుశనగ రైతులకు శరాఘాతంగా మారింది.

పంటల విధానంలో శాస్త్రీయ దృక్పథం లోపించడం, సేంద్రియ ఎరువుల బదులు రసాయన ఎరువులు వాడడం వల్ల భూసారం తగ్గుతోంది. ఏ పంట పండిరచినా గిట్టుబాటు ధరలు లభించడం లేదు. వీటిని అధ్యయనం చేయడం..నిపుణుల సలహా తీసుకోవడం ద్వారా సమగ్ర పంటల విధానం అమల్లోకి తీసుకుని రావాలి. అలా చేస్తే తప్ప దేశంలో ఆహారధాన్యాల కొరత రాదు. ప్రజలకు ఇబ్బందులు తప్పుతాయి.