రాష్టాల్ర ఖజానాను దెబ్బతీస్తున్న ఉచితాలు
రాష్టాల్ర ఖజానాను దెబ్బతీస్తున్న ఉచితాలు
నగదు పందేరంతో ఆర్థికంగా దివాళా
హెచ్చరికలను పట్టించుకోని పాలకులు
న్యూఢల్లీి,ఏప్రిల్20: నగదు బదిలీ పథకాలు ఇప్పుడు దేశాన్ని అప్పుల ఊబిలో నెడుతున్నా..వాటిపై అజమాయిషీ లేకుండా పోతోంది. పోటీపడి నేతలతంతా నగదు బదిలీ పథకాలను అనుసరిస్తున్నారు.
ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా పథకాలను ప్రవేశ పెడుతున్నారు. పేర్లు వేరయినా అందరి లక్ష్యం ఓట్లబేరమే అని చెప్పకతప్పదు. ఇలా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత పథకాలతో ఖాజానాలను ఖాళీ చేస్తున్నాయి.
ఓటుబ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతూ ఇదే అభివృద్ది అని దేశాన్ని మభ్యపెడుతున్నాయి. ప్రత్యేకంగా ఎపిలో డబ్బుల పందేరంతో ఆర్థికంగా దివాళా దిశకు చేరుకుంది.
పథకాల పేరుతో నేరుగా ప్రజల ఖాతాల్లో డబ్బులు జమచేస్తున్నారు. తెలంగాణలో కూడా అంతగా లేకున్నా కొంత నిర్మాణాత్మక కార్యక్రమాలకు పంచిపెట్టడం జరుగుతోంది. అయితే ఇందులో దుబారాను అరికట్టే ప్రయత్నాలు మాత్రం చేయడం లేదు.
ALSO READ: రైతులు రోడ్డెక్కడం..దాన్ని ప్రభుత్వాలు…
కిలో రూపాయి బియ్యిం పథకం దుబారా ద్వారా వేలకోట్లు దుర్వినియోగం అవుతున్నాయి. ఈ పథకాన్ని రెండు తెలుగు రాష్టాల్రు గొప్పగా చెప్పుకుంటున్నాయి. రైతుబంధులో భూములు ఉన్నా వ్యవసాయం చేయని వారికి కూడా వెళుతోంది. ఇలాంటి దుబారాను అరికడితే ఖజానాపై భారం తగ్గుతుంది. కానీ ఈ దిశగా ఆలోచనలు చేయడం లేదు.
ఎపిలో అయితే ఇక అభివృద్ది అన్నది ఏ మాత్రం కనిపించడం లేదు. దుబరా పథకాలతో రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక క్రమశిక్షణ పాటించట్లేదు. ఉచిత పథకాలు ఇలాగే కొనసాగితే ఆర్థిక సంక్షోభం తప్పదన్న హెచ్చరికలను బేఖాతరు చేస్తున్నారు. రాష్టాల్రు ప్రకటిస్తున్న పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ, వ్యవసాయ రుణమాఫీ వంటి ఆర్థికంగా అలివిగాని హావిూలు అందోళన కలిగిస్తున్నాయని అందులో పేర్కొంది.
ఎస్‌బీఐ తన నివేదికలో తెలంగాణను ఉదాహరణగా తీసుకుని ప్రస్తావించడం గమనార్హం. తెలంగాణ రెవెన్యూ ఆదాయంలో 35 శాతం మేర జనాకర్షక పథకాలకే ఖర్చవుతోందని ఎస్‌బీఐ నివేదిక పేర్కొంది. ఇది ఎక్కువ కాలం సాధ్యం కాదని.. ఆర్థిక విపత్తుకు కారణమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
ఒక్క తెలంగాణెళి కాదు.. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, బిహార్, రaార్ఖండ్, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్టాల్రు తమ రెవెన్యూ ఆదాయంలో 5 నుంచి 19 శాతం దాకా ఉచిత,జనాకర్షక పథకాలకే ఖర్చు చేస్తున్నాయి. ఆయా రాష్టాల్ర సొంత పన్ను ఆదాయాన్నే పరిగణనలోకి తీసుకుంటే ఆ ఖర్చు ఏకంగా 63 శాతం దాకా కూడా ఉంటున్నట్టు ఎస్‌బీఐ నివేదిక స్పష్టం చేసింది.
ALSO READ: వాతావరణ మార్పు అంటే…?
జీఎస్‌డీపీలో నాలుగు శాతానికి పైగా ఆర్థిక లోటుతో.. ఆరు రాష్టాల్ర పరిస్థితి ప్రమాదం అంచున ఉన్నట్టు హెచ్చరించింది. అలాగే.. ఏడు రాష్టాల్ర ఆర్థికలోటు వాటి బ్జడెట్ లక్ష్యాలను మించిపోగా.. 11రాష్టాల్రు మాత్రం ఆర్థికలోటును బడ్జెట్ లక్ష్యాలకు దిగువన లేదా సమానంగా ఉంచగలిగినట్టు ఎస్‌బీఐ తన నివేదికలో పేర్కొంది.
అరుణాచల్ ప్రదేశ్, రaార్ఖండ్, కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్, అసోం, బిహార్ రాష్టాల్రు బ్జడెట్ అంచనాలకు మించి ఆర్థికలోటును ఎదుర్కొంటున్నట్టు వెల్లడిరచింది. అదే సమయంలో.. ఏపీ, అసోం, గుజరాత్, హరియాణా, మహారాష్ట్ర, రాజస్థాన్, తెలంగాణ, పశ్చిమబెంగాల్ రాష్టాల్రు జీఎస్‌డీపీ వృద్ధిని.. స్థూలజాతీయోత్పత్తి (జీడీపీ) కన్నా ఎక్కువగా చూపుతు న్నట్టు పేర్కొంది.
ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూపుతున్న గణాంకాల మధ్య తేడాల గురించి ప్రస్తావించింది. ఇలాంటి తేడాలు గతంలోనూ ఉండేవని అభిప్రాయపడిరది. కేంద్రం నుంచి వచ్చే జీఎస్టీ ఆదాయం పలు రాష్టాల్ర పన్ను ఆదాయంలో ఐదో వంతు దాకా ఉంటోందని.. దాంట్లో అధిక భాగం ఉచితాలకే ఖర్చవుతోందని ఎస్‌బీఐ గ్రూప్ అధికారులు పేర్కొన్నారు. రాష్టాల్రకు కేంద్రం ’జీఎస్టీ పరిహారం’ ఇస్తున్న సంగతి తెలిసిందే.