రైతులు రోడ్డెక్కడం..దాన్ని ప్రభుత్వాలు…
రైతాంగ సమస్యలు యథాతథం !
సాగుచట్టాలను రద్దు చేశాక నేటికీ సమగ్ర వ్యవసాయ విధానంపై ఆలోచన చేయడం లేదు. దీనిపై సమగ్రంగా చర్చించాలన్న ధోరణి కానరావడం లేదు. దేశంలోని అన్నదాతలను ఆదుకోవడంతో పాటు.. దేశానికి అన్నం పెట్టాలన్న దూరదృష్టి నేతల్లో కొరవడిరది.
ఏం చేస్తే దేశంలో ప్రజలందరికి ఆహార ధాన్యాలు దక్కగలవో చర్చించడం లేదు. పంటలు పండుతున్నా అందరికీ ఆహారాధాన్యాలు నేటికీ అందుబాటులోకి రావడం లేదు. సాగుచట్టాలను రద్దు చేసిన తరవాత కూడా ప్రధాని మోడీ ఈ సమస్యల పై చర్చించడం లేదు. చట్టసభల్లో చర్చించడం లేదు. బయటా చర్చించడం లేదు.
ప్రపంచానికి అన్నం పెట్టే స్థితిలో భారతదేశం ఉన్నా..వ్యవసాయ రంగాన్ని అభివృద్ది చేసేందుకు మాత్రం నేతలు ముందుకు రావడం లేదు. పక్కా మార్కెటింగ్ వ్యవస్థ లేకపోవడం, భారీగా పండుతున్న పంటలను కొనుగోలు చేసే వ్యూహం ప్రదర్శించడం లేదు. పంటల కొనుగోలు సమయంలో సరైన వ్యూహంతో ప్రభుత్వాలు చర్య తీసుకుంటే ఇబ్బందులు రావు.
ALSO READ: వాతావరణ మార్పు అంటే…?
తెలంగాణలో 24 గంటల ఉచిత విద్యుత్…నీటి సరఫరా, రైతుబందు కింద పెట్టుబడి సాయం…రైతు చనిపోతే కుటుంబాన్ని ఆదుకునేందుకు రైతుబీమా పథకం అమలవుతున్నాయి. మిషన్ కాతీయ తదితర పథకాలతో చెరువుల్లో నీరు పెరిగి పంటల దిగుబడి పెరిగిందని ప్రభుత్వమే చెబుతోంది. ఇన్ని పథకాలు ప్రవేశ పెట్టి పంటలు కొనుగోలు చేయకపోతే ఎలా? పంటలు అమ్ముకోవడానికి రైతులు రోడ్డెక్కితే రాజకీయం ఎలా అవుతుంది.? గిట్టుబాటు ధరలు ఇవ్వాలని, పంటలు కొనుగోలు చేయాలని కోరుకోవడం ఏటా ఓ ప్రహసనంగా మారింది.
ఇది ఒక్క తెలంగాణ సమస్య కాదు. దేశవ్యాప్తంగా ఉన్న సమస్య. సీజన్ లో సకాలంలో పంటలు కొనుగోలు చేసి డబ్బులు ముట్టచెప్పితే చాలు.. రైతు సమస్యలు సగం తీరినట్లే. కానీ మార్కెట్ యార్డుల్లో పడిగాపులే రైతులను తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. దానికితోడు గిట్టుబాటు ధరలు రావు. అన్నీవున్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా కొనుగోళ్ల విషయంలో అటు కేంద్రం, ఇటు రాష్ట్రం పెద్దగా కార్యాచరణ చేపట్టడంలేదు. పంట ఏదైనా డిమాండ్ ఉండదు. అమ్ము కోవడానికి నానాకష్టాలు పడాల్సిందే.
ALSO READ: గ్రామంలో పొంగి పొరలుతున్న భక్తిభావం
ఇకపోతే దేశంలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా ప్రచారం కానరావడం లేదు. కొంతమంది రైతులు ఎరువులు ఎక్కువ వేస్తే దిగుబడి పెరుగుతుందని అనుకోవడం వల్ల మోతాదుకు మించి రసాయన ఎరువులు వాడుతున్నారు. దీంతో భూసారం దెబ్బతిం టోంది. అలాగే ప్రజల ఆరోగ్యం కూడా దెబ్బతింటోంది.
ఏటా దేశంలో రైతులు పంటలు పండిరచి గిట్టుబాటు ధరల కోసం రోడ్డెక్కాల్సిన దుస్థితి నెలకొంది. గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా ఇతరత్రా తాయిలాలు ప్రకటిస్తూ ప్రభుత్వాలు రైతన్నలను మోసం చేస్తున్నాయి. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని..మార్కెట్‌కు తీసుకుని వచ్చిన పంటలను సకాలంలో కొనుగోలు చేయాలన్న రైతులకు నిరాశే ఎదురవుతోంది.
ప్రధానం గా వరి,కంది, మిర్చి, పత్తి, ఎర్రజొన్న, పసుపు రైతులు బాధలు వర్ణనాతీతం. సన్నకారు రైతులకు అండగా ఉన్నానని,ఏటా 6వేల కోట్లు వారి ఖాతాల్లో వేస్తున్నానని ప్రధాని మోడీ గొప్పగా ప్రకటించు కోవడం తప్ప సమగ్ర వ్యవసాయ విధానానికి శ్రీకారం చుట్టడం లేదు. నిజానికి ఖాతాల్లో డబ్బులు వేయడం కాకుండా వ్యవసాయాన్ని ఎలా ముందుకు తీసుకుని వెళ్లాలో ఆలోచించడం లేదు.
గ్రామాలను ఆధారం చేసుకుని వ్యవసాయాన్ని పాడి పరిశ్రమను, కోళ్ల పరిశ్రమను ఉమ్మడిగా అభివృద్ది చేయాలి. దీంతో గ్రావిూణ వృత్తులకు కూడా ఆసరా దక్కుతుంది. కానీ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచన చేయడం లేదు. అకాల వర్షాల కారణంగా భారీగా పంటలు దెబ్బతింటున్న సందర్భంలో వారికి సకాలంలో పరిహారం అందడం లేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 33 శాతానికంటే ఎక్కువ మొత్తంలో పంటలు దెబ్బతింటేనే నష్టపరిహారానికి సిఫార్సు చేసి ప్రభుత్వానికి నివేదిస్తారు.
ALSO READ: రూ. 200 పెరిగిన బంగారం
ప్రభుత్వ నిబంధనల ప్రకారం జరుగుతున్న నష్టం లెక్కల్లోకి రావడం లేదు. పంటనష్టం అంతకు మించి ఉంటేనే వ్యవసాయాధి కారులు వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదిస్తున్నారు. గత కొన్నేళ్లుగా బీమా చేస్తున్న రైతులకు పరిహారం అందేది నామమాత్రంగానే ఉంటుంది. వేల సంఖ్యలో రైతుల పంట నష్టం జరిగినా, రైతులకు అందుతున్నది మాత్రం తక్కువగానే ఉంటుంది.
వర్షాలు కురియడం,పంటను నష్ట పోవడం కారణంగా రైతులు ఆందోళన చెందుతున్నా అందడం లేదు. బీమా నిబంధనల ప్రకారం నష్టం 33 శాతం దాటితేనే పరిహారం వచ్చే అవకాశం ఉంది. ఈ నిబంధనలను మార్చాల్సి ఉంది. ఇన్సూరెన్స్ ఉన్న రైతులందరికి పరిహారం దక్కడం లేదు.
భారీ వర్షాలతో నష్టపోతే రుణాలు తీసుకున్నవారికి ఈ బీమాను అమలు చేయక పోవడంతో రైతులపై అదను భారం పడుతోంది. నిబంధనల ప్రకారం ఐదేళ్ల ఉత్పత్తి ఆధారంగా ఎంత పంటనష్టం జరిగితే అంతే మొత్తాన్ని అందించనున్నారు. అకాల వర్షాలు భారీగా పంట నష్టాన్ని కలిగించి, రైతుకు కంటివిూద కునుకు లేకుండా చేస్తున్నాయి. చేతికి వచ్చిన పంటను కాపాడు కునేందుకు రైతులు ఎంత ప్రయత్నించినా సాధ్యం కావడం లేదు.
అకాల వర్షాల కారణంగా పంటలు దెబ్బతింటున్నాయి. ఈ సమస్యలను అన్నీ చర్చించాలి. ఆర్థికంగా తాయిలాలు ఇవ్వడం కాకుండా సమస్యలను చర్చించి విధానాలు రూపొందించాలి. కెసిఆర్ ప్రవేశ పెట్టిన రైతుబంధును ప్రవేశ పెట్టిన కేంద్ర ప్రభుత్వం..పంటల కొనుగోళ్లకు సంబంధించి నిర్దిష్ట విధానాలు అమలు చేయడం లేదు.
మార్క్‌ఫెడ్, సిసిఐలు రంగంలోకి దిగినా ఫలితం దక్కడంలేదు. కేంద్ర ప్రభుత్వం ఈ`నామ్ అంటూ అట్టహాసంగా ప్రకటనలు చేసినా రైతులకు మేలు చేకూర్చలేదు. పంటలను గిట్టుబాటుధరకు రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏటా రైతులు రోడ్డెక్కడం..దాన్ని ప్రభుత్వాలు పట్టించుకోక పోవడం మామూలు విషయంగా మారింది.
గిట్టుబాటు ధరలతో పాటు కొనుగోళ్ల కోసం పలుమార్లు ఆందోళనలు చేపట్టినా ప్రభుత్వం నుంచి స్పందన కరువవడంతో రైతులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. పంటలు మార్కెట్‌కు వచ్చే సమయంలో పక్కాగా కొనుగోళ్లు సాగాలి. గిట్టుబాటు ధరలు దక్కాలి. దళారుల మోసాలు అరికట్టాలి.
ఏటా పంట ఏదయినా జిల్లాల్లో పండిరచిన పంటలను కొనేలా కార్యాచరణ సాగాలి. ఇదంతా కూడా పక్కాగా ప్రణాళిక మేరకు సాగాలి. ఇందుకు వ్యవసాయా విధానాలను రూపొందించాలి. ఏటా పండిరచిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించి కొనుగోళ్లు చేయడం ప్రభుత్వం బాధ్యతగా గుర్తించాలి.